Stone Sword: రాజుగారి రాతి ఖడ్గం.. తరిచిచూస్తే అదో వందల ఏళ్ల రక్తచరిత్ర..

సరిగా పదకొండవ శతాబ్దంలో ఇప్పటి బ్రిటిష్ దేశంలో ఉత్తర్, అతడి సోదరుడు ఉండేవారు. రాజ కాంక్ష మెండుగా ఉండే ఉత్తర్ సోదరుడు.. అతనితో ఎప్పటికీ గొడవ పడుతుండేవాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 4, 2024 11:46 am

Stone Sword

Follow us on

Stone Sword: రాజు గారి వైభోగం.. రాణిగారి విలాసం.. రాజ్యం గొప్పతనం.. సిపాయిల యుద్ధ రీతి.. చెలికత్తెల నాట్య గతి.. ఇదేనోయ్ చరిత్ర అంటే.. ఇదేనోయ్ ఇతిహాసమంటే.. అని వెనుకటికి ఓ కవి చెప్పాడు. రాజ్యాలు, వాటి చరిత్ర మనకు పుస్తకాల్లో చదువుకుంటే తప్ప నిజంగా చూసింది లేదు.. వాటిని ప్రత్యక్షంగా తరించింది లేదు. అయితే బ్రిటిష్ దేశంలో ఒక రాజు వాడిన ఖడ్గం చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ ఖడ్గం ఆనవాలును వారు పరిశీలిస్తుంటే విస్మయానికి గురి చేసే నిజాలు కళ్ళ ముందు కదులుతున్నాయి. ఆ రాజు చరిత్ర..అతడి రాతి ఖడ్గం.. దాని వెనుక ఉన్న మిస్టరీ.. ఏమిటో ఒకసారి తెలుసుకుందామా..

సరిగా పదకొండవ శతాబ్దంలో ఇప్పటి బ్రిటిష్ దేశంలో ఉత్తర్, అతడి సోదరుడు ఉండేవారు. రాజ కాంక్ష మెండుగా ఉండే ఉత్తర్ సోదరుడు.. అతనితో ఎప్పటికీ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఉత్తర్ ను అతడు ఓడించి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే తన సోదరుడితో తన కుమారుడికి ఎప్పటికైనా ప్రమాదమేనని గుర్తించి ఒక చిన్న పడవలో తన కుమారుడిని ఉంచి నదిలో వదిలాడు. ఆ తర్వాత ఉత్తర్ ఒక ఖడ్గంతో తనను తాను చంపుకుని ఒక రాయిలా మారాడు. ఆ ఖడ్గాన్ని తనమీద అలానే ఉంచుకున్నాడు. కాలక్రమంలో ఆ ఖడ్గం ఆ రాతి పై అలానే ఉండిపోయింది.. ఇక ఉత్తర్ సోదరుడు అప్పటినుంచి ఆ రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు. మంత్రగత్తెల సహాయంతో తనకు తన అన్న సోదరుడి ద్వారా ముప్పు పొంచి ఉందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ రాతి నుంచి ఖడ్గం ఎవరైతే తీస్తారో వారే తన సోదరుడు కుమారుడు అని అతడికి ఆ మంత్రగత్తెలు చెబుతారు. అలా రాజ్యంలో ఉన్న యువకులను మొత్తం ఆ ఖడ్గం తీయమని ఆదేశిస్తాడు. ఆ యువకుల గుంపులో ఉత్తర్ కుమారుడు ఆర్థర్ కూడా ఉంటాడు. అయితే ఆర్థర్ వంతు వచ్చిన తర్వాత ఆ ఖడ్గాన్ని రెండు చేతులతో పట్టుకొని పైకి లేపుతాడు. ( ఉత్తర్ ఎప్పుడైతే చిన్న పడవ ద్వారా నీటిలో అతడి కుమారుడిని వదులుతాడో.. అతడు ఒక గిరిజన తెగ దొరుకుతాడు. వారు అతన్ని పెంచి పెద్ద చేస్తారు. ఆ గిరిజనుల ప్రాంతం క్రమేపి ఆ రాజ్యంలో కలిసిపోతుంది) అప్పుడు ఆ ఖడ్గం ద్వారా అనేక శక్తి సామర్థ్యాలు ఆర్థర్ కు లభిస్తాయి. ఎప్పుడైతే ఆర్థర్ ఖడ్గం లేపుతాడో గతంలో జరిగిన చరిత్ర మొత్తం అతడి మదిలో మెదులుతుంది.. ఆ తర్వాత యుద్ధం చేసి తన తండ్రి సోదరుడిని అతడు చంపుతాడు.

రాజ్యం మొత్తం ఉత్తర్ కుమారుడి సొంతమైన తర్వాత.. ఇతర రాజ్యాల మీద దాడులు చేసి తన సామ్రాజ్యాన్ని మరింత సుసంపన్నం చేసుకుంటాడు. అంతేకాదు ప్రజలకు యుద్ధ విద్యల్లో, అనేక కళల్లో శిక్షణ ఇప్పిస్తాడు. ఇలా తన రాజ్యాన్ని మరింత విస్తరించి మకుటం లేని మహారాజుగా వెలుగొందుతాడు.. అయితే ఒక రోజు తన భార్యతో కలిసి యుద్ధాన్ని గెలిచి వస్తుండగా ఒక మాయా సరస్సు ఆ రాజు కాళ్లకు కనిపిస్తుంది. దాహం వేసి అందులో నీరు తాగుతుండగా ఒక అందమైన యువతి అతడికి ప్రత్యక్షమవుతుంది. ఒక బలమైన ఖడ్గాన్ని అతడికి బహుకరిస్తుంది. ఆ ఖడ్గాన్ని చేత పట్టుకుంటే అనేక శక్తి సామర్థ్యాలు మీ సొంతమవుతాయని రాజుకు ఉపదేశిస్తుంది. అలా ఆ రాజు ఆ ఖడ్గం పట్టుకోగానే ఆకాశంలో మెరుపు మెరుస్తుంది. అనంతరం అనేక శక్తి సామర్థ్యాలు అతడి సొంతమవుతాయి. అయితే కాలక్రమేణ ఆర్థర్ సామ్రాజ్యం పతనమవుతుంది. అదే తన తండ్రి చనిపోయినట్టుగానే ఆర్థర్ కూడా కన్నుమూస్తాడు. అలాగే అతడు వాడిన ఖడ్గం కూడా ఆ రాతిలో బంధించి ఉంటుంది.. ఎవరైతే ఆ ఖడ్గం తీస్తారు అతడే ఆ రాజ్యానికి రాజు అని అప్పట్లో అనుకునేవారు. కాలక్రమేణా ఖడ్గం బంధీ ఉన్న రాయి ఇంగ్లాండ్ దేశంలోని ఓ సరస్సులో కలిసిపోయిందని చరిత్రకారుల పరిశోధనల తేలింది..

అయితే ఆ ఖడ్గానికి కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించగా అది 11వ శతాబ్దం నాటిది అని తేలింది. అంటే కింగ్ ఆర్థర్ ఒకప్పుడు ఇంగ్లాండు దేశాన్ని పాలించాడు అని చెప్పడానికి చారిత్రాత్మక రుజువులు దొరికాయని చరిత్రకారులు ఇప్పటికీ నమ్ముతుంటారు.. ఇక ఇలాంటి చరిత్ర ఇటలీలోని టుస్కానీ ఈ ప్రాంతంలో కూడా ఉంది. ఆ ప్రాంతాన్ని అప్పట్లో షాన్ గల్గానో అనే రాజు పాలించేవాడు. అతడు కూడా ఆర్థర్ లాగానే గతించాడు.. ఇప్పటికీ ఆ ఖడ్గం అక్కడ అలాగే ఉంది అని చరిత్రకారులు చెబుతున్నారు.. అయితే ఆర్థర్ వాడిన ఖడ్గం ధర ఎంత ఉంటుంది అని గూగుల్ చేస్తే అక్షరాల 300 కోట్ల రూపాయలు అని తేలింది. అంటే దీనిని బట్టి నాడు రాజులు తమ ఖడ్గాలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు..

ప్రస్తుతం నాడు ఆర్థర్ వాడిన ఖడ్గానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే  ఆర్థర్ జీవిత చరిత్ర సంబంధించి ఒక సినిమా కూడా రూపొందింది. అయితే అతడు వాడిన ఖడ్గం ఇప్పటికే మిస్టరీగానే ఉందని ఆ సినిమాలో దర్శకుడు చూపించడం విశేషం.