Athadu : ‘అతడు’ సినిమాలో నంద కిషోర్, పార్థు పేర్లు పెట్టడం వెనక అంత స్టోరీ ఉందా..?

ఇక మొత్తానికైతే అతడు సినిమా త్రివిక్రమ్ కెరియర్ లో గాని, మహేష్ బాబు కెరియర్ లో గాని ఒక మెమొరబుల్ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికి ఈ సినిమాని చూడడానికి ప్రతి ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు అంటే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు...

Written By: NARESH, Updated On : March 23, 2024 8:48 am

athadu

Follow us on

Athadu : ఒక సినిమాని మాటలతో కూడా హిట్ చేయొచ్చు అని నిరూపించిన ఒకే ఒక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్… ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రి లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికే ఆయన రైటర్ గా, డైరెక్టర్ గా పలు విభాగాల్లో ఆయన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన మహేష్ బాబు ను హీరోగా పెట్టి చేసిన అతడు సినిమాలో మహేష్ బాబు పేరు ‘నందకిషోర్ ‘ కానీ ఆయన ‘పార్థసారథి’ గా పేరు మార్చుకొని రాజీవ్ కనకాల ప్లేస్ లో ఆ ఇంటికి వెళతాడు. ఇక అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలను ఆ కుటుంబం చూపించిన ప్రేమ ఆయన్ని ఎలా మార్చాయి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈ పేర్లు పెట్టడం వెనక గల కారణం ఏంటి అంటే పార్థసారథి అంటే మహాభారతంలో ‘అర్జునుడి ‘ పేరు, అలాగే నందకిషోర్ అంటే ‘కృష్ణుడి’ పేరు…

ఇక పార్థసారథి మధ్యలో మరణిస్తే ఆయన ప్లేస్ లోకి వెళ్ళిన నంద కిషోర్ అక్కడున్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశాడు అనే ఉద్దేశ్యంతోనే ఈ పాత్రలకి ఆ పేర్లను పెట్టి దాన్ని మైథాలజికల్ వే లో కన్వే చేసే ప్రయత్నం అయితే చేశాడు.ఇక మొత్తానికైతే ఈ ప్రాసెస్ లో త్రివిక్రమ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
కృష్ణుడు అర్జునుడి రూపంలో వెళితే ఎలా ఉంటుందని తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు.ఇక ఈ సినిమాని ఇండెప్త్ గా మనం అనాలసిస్ చేస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి.

ఇక మొత్తానికైతే అతడు సినిమా త్రివిక్రమ్ కెరియర్ లో గాని, మహేష్ బాబు కెరియర్ లో గాని ఒక మెమొరబుల్ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికి ఈ సినిమాని చూడడానికి ప్రతి ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు అంటే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు…