Telugu Bigg Boss 6: అప్పటి వరకు టీవీ చూడని వారు రాత్రి కాగానే బుల్లితెరకు అతుక్కుపోతున్నారు.. ఎన్ని పనులున్నా వాటిని త్వరగా పూర్తి చేసి స్మాల్ స్క్రీన్ ముందు వాలిపోతారు. ఆద్యంతం ట్విస్టులు.. ఎమోషన్స్.. ఇలా రకరకాల ఫీలింగ్స్ లైవ్ లో చూపించే నంబర్ 1 రియాలిటీ షో బిగ్ బాస్ ను కళ్లార్పకుండా జనాలు చూస్తారు. సగటు టీవీ ప్రేక్షకుడు బిగ్ బాస్ షో ను దాదాపుగా ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే టీవీలో బిగ్ బాస్ 5 విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఈ ఐదో సీజన్ ఎండింగ్ లో ఇక నుంచి ఓటీటీ బిగ్ బాస్ రన్ అవుతుందని అప్పటి హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం ఓటీటీలో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ అని పేరు పెట్టారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ 6వ రెగ్యులర్ సీజన్ ను టీవీలో ప్రసారం చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం అందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

హిందీలో సక్సెస్ అయిన బిగ్ బాస్ షోను దక్షిణాది భాషల్లో అదే పేరుతో నిర్వహిస్తున్నారు. తెలుగులోనూ ‘మా’ టీవీలో 2017 నుంచి ప్రసారం చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించి షో కు ఊపు తెచ్చారు. ఆ తరువాత ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఆయన నిర్వహణపై చాలా విమర్శలు వచ్చాయి. ఆయన హోస్టుపై ఓటింగ్ శాతం కూడా తగ్గింది. విమర్శలతో నాని తప్పుకున్నారు. మూడో ఎపిసోడ్ నుంచి నాగార్జున బాధ్యతలు తీసుకొని 4,5 ఎపిసోడ్లకు కూడా ఆయన హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జునే హోస్ట్ గా చేస్తున్నారు. అనుకున్నట్లుగానే బిగ్ బాస్ ఓటీటీ విజయవంతంగా ప్రసారం అవుతోంది.
Also Read: Singer Sunitha: ‘సింగర్ సునీత’ చెరుకు రసం.. నెటిజన్లు ఫిదా !
తాజాగా బిగ్ బాస్ ఓటీటీతో సంబంధం లేకుండా టీవీలో 6వ ఎపిసోడ్ ప్రసారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రతీ సంవత్సరం ప్రారంభించే టైం కంటే ముందే ఈ షో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా 6వ ఎపిసోడ్ కు మళ్లీ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే మూడు సీజన్లలో అలరించిన నాగార్జున మరోసారి బిగ్ బాస్ రెగ్యులర్ చేస్తాడా? లేదా?అన్నది డౌట్. ఇక దీనికి నాగార్జున ఒప్పుకోకుంటే మరో హోస్ట్ ను వెతికే పనిలో పడ్డారట నిర్వాహకులు. అయితే నాగార్జున నుంచి మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో నాగార్జునే బిగ్ బాస్ 6ను చేసే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ ఎక్కడ..? ఎలా ..? నిర్వహించాలన్న దానిపై బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఓటీటీ బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న తరుణంలో బిగ్ బాస్ 6ను కూడా ప్రారంభిస్తే ఎక్కడ నిర్వహిస్తారన్నది ప్రశ్న. ఓటీటీ ముగిశాక ఈ షో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈసారి కంటెస్టెంట్ల విషయంలో కాస్తా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు యూట్యూబ్ స్టార్లు, సినీ జూనియర్ ఆర్టిస్టులను మాత్రమే తీసుకున్నారు. ఈసారి బడా సెలబ్రెటీలను కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. వారితో పాటు కామన్ మ్యాన్ కూడా ఉంటారట. గతంలో కామన్ మ్యాన్ ప్లేసులో వచ్చిన వారు అంతగా ఆకట్టుకోలేకపోయారు. మరి ఈసారి ఎవరు వస్తారోనని ఆసక్తిగా మారింది.
Also Read: Samantha Cars: సమంత ఎన్ని కార్లు వాడుతుందో తెలుసా?
Recommended Videos


