https://oktelugu.com/

CM KCR- CS Somesh Kumars: సీఎస్ సోమేష్ కు కేసీఆర్ మంగళం పాడుతున్నారా?

CM KCR- CS Somesh Kumars: తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఏపీ క్యాడర్ అయినా క్యాట్ లో ఆర్డర్స్ తెచ్చుకుని మరీ తెలంగాణలో కొనసాగుతున్నారు. దీంతో కేసీఆర్ నమ్మకస్తుడని భావించి ఆయనను సీఎస్ చేశారు. కానీ ఆయన తీరుపై మొదటి నుంచి వివాదాలే వస్తున్నాయి. విధి నిర్వహణలో అలసత్వం, అంకితభావం లేకపోవడం, చెప్పిన పని చెప్పినట్లుగా చేయకపోవడం వంటి అనేక ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అడ్డు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 4, 2022 / 10:17 AM IST
    Follow us on

    CM KCR- CS Somesh Kumars: తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఏపీ క్యాడర్ అయినా క్యాట్ లో ఆర్డర్స్ తెచ్చుకుని మరీ తెలంగాణలో కొనసాగుతున్నారు. దీంతో కేసీఆర్ నమ్మకస్తుడని భావించి ఆయనను సీఎస్ చేశారు. కానీ ఆయన తీరుపై మొదటి నుంచి వివాదాలే వస్తున్నాయి. విధి నిర్వహణలో అలసత్వం, అంకితభావం లేకపోవడం, చెప్పిన పని చెప్పినట్లుగా చేయకపోవడం వంటి అనేక ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అడ్డు తొలగించుకోవాలనే సీఎం కేసీఆర్ చూస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అధికారులదే కీలక బాధ్యతలు అని తెలిసిందే. దీంతో వారు ఎంత బాగా పనిచేస్తే అంత పేరు ప్రభుత్వానికి వస్తుంది. వారు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత చెడ్డ పేరు వస్తుందని చెబుతారు. అలాంటి సీఎస్ సోమేశ్ కుమార్ తన ప్రవర్తనతో అందరిని అగాధంలోకి పడేస్తున్నారు.

    CM KCR- CS Somesh Kumars

    ఇటీవల ఢిల్లీలో జరిగిన సీజేఐ, సీఎం సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ సీఎస్ సోమేశ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్వవహరిస్తున్నారని అన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ కు కూడా సీఎస్ ను వదిలించుకోవాలని ఉన్నట్లు సమాచారం. ఆయన కూడా సమయం కోసం వేచి చూస్తున్నారని ఏదో అవకాశం వస్తే ఆయనను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. బాధ్యత గల అధికారిగా ఉంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయనకు తెలియదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

    Also Read: Chandrababu Badude Badudu Tours: జగన్ టార్గెట్ గా చంద్రబాబు ‘బాదుడే బాదుడు’ టూర్లు..

    కేసీఆర్ తనకు ఇష్టమైన వాడని నమ్మి పదవి కట్టబెట్టినందుకు ఫలితం అనుభవిస్తున్నారు. పన్నెండు మందిని కాదని సోమేశ్ కు అదికారం ఇస్తే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగినట్లుగా తయారయింది పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో సీఎస్ గా ఈయన ఉంటే కేసీఆర్ కు తలవంపులు తప్పవు. అందుకే ఆయనను మార్చి వేరే వారిని పెట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎస్ సోమేశ్ కుమార్ కు పదవీ గండం ఉన్నట్లు సమాచారం. ఆయనపై ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఆరోపణలు చేశారు. అయినా ఆయన బద్దకం వదలట్లేదు. బాధ్యతా రాహిత్యాన్ని త్యజించట్లేదు. దీంతో ప్రభుత్వానికి మాత్రం రావాల్సిన పేరు మాత్రం వచ్చింది.

    CM KCR- CS Somesh Kumars

    అసలు సీఎస్ గా రామకృష్ణా రావును తీసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి సోమేశ్ ను మార్చి రామకృష్ణారావును నియమించుకోవాలని పక్కా ప్రణాళికతో ఉన్నట్లు చెబుతున్నారు. సోమేశ్ కుమార్ విధుల్లో అంకితభావం లేదని తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి అంటే ఎంత పకడ్బందీగా ఉండాలి. ఎన్ని పనులు చక్కబెట్టాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా పాలకులు మాత్రం చెడ్డపేరుతీసుకొచ్చే ఆయనను భరించే వారు ఎవరు లేరని తెలుస్తోంది. అందుకే సీఎస్ గా ఆయనను సాగనంపేందుకు సమయం కోసం చూస్తున్నట్లు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

    సోమేశ్ కుమార్ వ్యవహార శైలి కూడా సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది. ఏదైనా అడిగితే సమాధానం కరెక్టుగా చెప్పరనే వాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నా ఆలస్యమే అమృతంగా భావించి అన్నింట్లో కూడా లేటు చేస్తారనే అపవాదు ఉంది. దీంతో ఆయన తీరు పట్ల విసిగి వేసారి పోయారు. అందుకే ాయనను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read:IPL 2022- Ravindra Jadeja: జడేజా సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కారణాలేంటి?

    Recommended Videos


    Tags