https://oktelugu.com/

Parliament Session : అందరూ అనుకుంటున్నట్లు జమిలీ ఎన్నికల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కాకపోవచ్చు

లోక్ సభకు ముందు జరిగేవి.. తర్వాత జరిగే 15 రాష్ట్రాల్లో మాత్రమే ఇందుకు అవకాశం ఉందని తేల్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2023 6:44 pm

    Parliament Session : నిన్నా ఇవాళ టీవీల్లో ఒక్కటే చర్చ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి 22 వరకూ 5 రోజులు జరుగనున్నాయి. ఆ సమావేశాల్లో జమిలీ ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టే పార్లమెంట్ సమావేశాలు పెట్టారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో హేతుబద్దత ఉందా? అన్నది ఆలోచించాలి.వన్ నేషన్ వన్ పోల్ వస్తుందని చట్టం తెస్తారని అంటున్నారు.

    అసలు దీనికి సంబంధించి లా కమిషన్, నీతి అయోగ్, ఈసీ దీనిపై తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. వాళ్లు చెప్పిన అభిప్రాయం ప్రకారం.. ‘ఆచరణ యోగ్యంగా ఉండాలంటే రెండు దఫాలుగా జరగాలి. లోక్ సభకు ముందు జరిగేవి.. తర్వాత జరిగే 15 రాష్ట్రాల్లో మాత్రమే ఇందుకు అవకాశం ఉందని తేల్చారు.

    తర్వాత రెండున్నర సంవత్సరాలకు మరో 14 రాష్ట్రాలకు ఎన్నికలు జరగొచ్చు అని తేల్చారు. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకుండా సార్వత్రిక ఎన్నికలతోపాటు సగం రాష్ట్రాలు.. మరో రెండున్నర సంవత్సరాలకు మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేలా పెట్టొచ్చన్నది ఈసీ మాట..

    అందరూ అనుకుంటున్నట్లు జమిలీ ఎన్నికల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కాకపోవచ్చు అని ‘రామ్’ గారి విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

    అందరూ అనుకుంటున్నట్లు జమిలీ ఎన్నికల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కాకపోవచ్చు || Ram Talk