School in the Thar Desert : దేశంలో అత్యధిక ఎడారి కలిగిన ప్రాంతం ఏదంటే ఠక్కున చెప్పేస్తాం.. ‘థార్ ఎడారి’ అని. మిగతా ప్రాంతాల్లో వేసవి కాలంలోనే వేడి ఉంటుంది. కానీ థార్ ఎడారిలో ఎప్పుడూ ఎండ మండిపోతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతటి ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతంలో పిల్లల చదువుల కోసం ఓ పాఠశాల నిర్మించారు. అది కూడా రాజస్థాన్ లోని థార్ ఎడారి ఉండే జైసల్మార్ లోని ప్రత్యేకంగా బాలికల కోసమే నిర్మించారు. అక్కడి బాలికలు విద్యకు దూరమవుతుండడంతో కొన్ని ఫౌండేషన్లు కలిసి దీన్ని నిర్మించాయి. థార్ ఎడారిలో మాములు జనాలు ఉండడానికే ఇబ్బందులు పడుతారు. కానీ పిల్లలు ఎలా ఉండగలుగుతారు..? అనే ప్రశ్న రావచ్చు. కానీ ఏసీ భవనంలా విద్యార్థులకు చల్లటి వాతావరణం కలిగించే విధంగా స్కూల్ ను నిర్మించారు. ‘డయానా కెల్లగాన్’ అనే మహిళా డిజైన్ రూపొందించగా.. జై సల్మీర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మన్వేందర్ సింగ్ స్కూల్ కోసం 22 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటో చూద్దాం..

సాధరణంగా వేసవి కాలం రాగానే స్కూల్ విద్యార్థులకు సెలవులు ఇచ్చేస్తారు. కానీ థార్ ఎడారిలో ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఓ స్కూల్ భవనాన్ని నిర్మించారు. జై సల్మేర్ శామ్ డ్యూన్స్ లో కనోయ్ గ్రామ సమీపంలోని థార్ ఎడారిలో ఉంది ‘రాజకుమారి రత్నావతి’ బాలికల పాఠశాల. ఈ స్కూల్ లో 400 మంది విద్యార్థులు చదువుకునేలా కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో ఒక మ్యూజియం, రెండు ప్రదర్శన శాలలు ఉన్నాయి.
ఇందులోనే ఓ లైబ్రరీ, ఆడియో విజువల్ లెక్చర్ హాల్ కూడా ఉన్నాయి. న్యూయార్క్ కు చెందిన డయానా కెల్లగాగా డిజైన్ రూపొందిందించగా.. రిజిస్టర్ అయిన సిట్టా అనే సంస్థ ఈ స్కూల్ ను నిర్మించింది. బాలికలు మాత్రమే చదువుకునే ఇందులో వారి తల్లులకు కూడా జీవనోపాధి కల్పించే సౌకర్యం కల్పించారు. వారి ఉపాధి కోసం చేనేత, అల్లికలు, రంగులు అద్దడం లాంటి వృత్తి శిక్షణను ఇస్తారు. ఇందుకోసం ఓ భవనం కేటాయించారు.
రెండేళ్ల కిందటే ఈ స్కూల్ నిర్మాణం పూర్తయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ స్కూల్ భవనాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఎడారి మధ్యలో వికసించిన పుష్పంలా భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. గాలి వెలుతురు సమృద్దిగా ప్రసరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శాండ్ స్టోన్ తో భవనం చుట్టూ మెష్ గోడలు నిర్మించడంతో భవనం లోపల ఏసీ వాతావరణాన్ని తలపిస్తాయి. దీంతో పిల్లలకు ఎలాంటి వేడి తాకదు. అంతటి థార్ ఎడారిలో ఏసీలో ఉండే ఇంతటి ప్రత్యేకత గల స్కూలు ఇప్పుడు వైరల్ అవుతోంది. దాని విశేషాలు తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాలికల విద్య కోసం కొన్ని సంస్థలు చేసిన కృషి ఫలితాన్ని ఇచ్చింది. తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని వీళ్లు నిరూపించారు
