The Nun II review : హారర్ చిత్రాలు ఎక్కువగా ఇష్టపడే వారికి నన్ మూవీ కొత్త కాదు. సినిమా థియేటర్లో ఏ మూవీ చూస్తూ ఉంటే హార్ట్ బీట్ పందెపు గుర్రంలా పరిగెత్తాల్సిందే. ఎంత పెద్ద ధైర్యవంతుడికైనా వెన్నులో వణుకు పుట్టించేలా ఉండే చిత్రం నన్. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ గా వచ్చిన నన్ 2 చిత్రం ఎలా ఉందంటే…
వరద నీరు పారేటప్పుడు రిజర్వాయర్ గేట్లు ఎత్తేస్తే నీటి ఉధృతి ఏ రకంగా ఉంటుందో ఈ సినిమా హాల్లో కూర్చున్న వారి భయం ఉద్ధృతి ఆ రకంగా ఉంటుంది. గూస్ బంప్స్ కాదు…హాట్స్ జోక్స్ వస్తున్నాయి ఈ మూవీలోని ఒక్కొక్క ట్విస్ట్ కి. ఈ మూవీ తిరిగి మనల్ని భయంకరమైనటువంటి ఆ హాంటెడ్ హౌస్ ప్రపంచానికి తీసుకువెళ్తుంది…చీకటి గదిలో…మెల్లని కదలికల మధ్య…సడన్గా థియేటర్ లో వచ్చే సౌండ్…దాంతోపాటుగా స్క్రీన్ పై నన్ క్లోజ్ అప్… ఫస్ట్ సిరీస్ చూడకుండా సినిమాకి వెళ్ళిన వారికి అయితే సీటు తడిచిపోతుంది.
ఈ మూవీ ఫస్ట్ సిరీస్ మూవీ తర్వాత నాలుగు సంవత్సరాలకు బిగిన్ అయినట్లు చూపిస్తారు. ఫ్రాన్స్ లో ఉన్న ఒక బోర్డింగ్ స్కూల్లో సిస్టర్ ఐరీన్ (తైస్సా ఫార్మిగా) మరోసారి వాలాక్ (నన్) అపవిత్రమైనటువంటి ఆత్మతో పోరాడాల్సి వస్తుంది. ఇందులో ఈ వాళ్లకు యొక్క అసలు నేపథ్యం ఏమిటి.. తను అలా ఎందుకు శపించబడింది అనే రహస్యాలను లోతుగా పరిశీలించడం జరుగుతుంది.
ఈ మూవీలో ఒక్కొక్క హారర్ సీన్ సీట్లో నుంచి అలా ఎగిరి కూర్చునేలా చేస్తుంది. ఒకానొక టైంలో అసలు థియేటర్ నుంచి పారిపోవాలనిపిస్తుంది…కానీ తర్వాత ఏం జరుగుతుంది అనే వచ్చు కదా మనల్ని అక్కడ నుంచి కదలనివ్వదు. ఈ మూవీకి స్టోరీ కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పవచ్చు. లో పిచ్ నుంచి సడన్గా హై పిచ్…. బెల్ రింగ్ సౌండ్…దూరంగా గాలి శబ్దం.. ఇలా ఒక్కొక్క సౌండ్ బ్యాగ్రౌండ్ లో వస్తూ ఉంటే మన హాట్ బీట్ సౌండ్ మన చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది.
కానీ మూవీ ఒక రేంజ్ కి వచ్చిన తర్వాత వాలక్ యొక్క ప్రవర్తన అనుకున్నంత హారర్ పుట్టించవు. ఇందులో కొన్ని సీన్స్ ఇంతకుముందు ఇదే తరహా హారర్ చిత్రాలలో చూసినట్లుగా అనిపించడంతో వాటి ఇంటెన్సిటీ తగ్గి చాలా రొటీన్ అనిపిస్తాయి. సినిమా ఎండింగ్ కి వచ్చేటప్పటికి కాస్త క్లైమాక్స్ హడావిడిగా పూర్తి చేశారు అన్న భావన కలుగుతుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ తమ రోల్స్ కు ..తమ వంతు న్యాయం చేశారు. కానీ వారి ప్రయత్నాన్ని స్క్రిప్ట్ కాస్త గందరగోళంగా మార్చినట్లు కనిపిస్తోంది. ఒక సీన్ పండాలి అంటే కథాకథనం ఉంటే సరిపోదు దానికి తగ్గ ఇంటెన్సిటీ క్రియేట్ చేయాలి. ఆ చిన్న పాయింట్ కొన్ని సీన్స్ లో మిస్ అయినట్లు కనిపిస్తుంది.
రేటింగ్ : 3/5
Web Title: The nun ii review a familiar haunting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com