
ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ వినియోగం పెరగడంతో మోసాలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. చెక్కులపై చేసే సంతాలను సైతం చాలామంది ఫోర్జరీ చేస్తున్నారు. మోసాలకు అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వేలిముద్రలనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ప్రముఖ కంపెనీల్లో సైతం వేలిముద్రల ద్వారానే అటెండెన్స్ నమోదవుతుంది. స్మార్ట్ ఫోన్లను ఇతరులు దొంగలించకుండా చాలామంది ఫింగర్ ప్రింట్ లాక్ ను సెట్ చేసుకుంటున్నారు.
Also Read: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఆఫీస్ లో నిద్రపోతే జాబ్ పోయినట్లే..?
అయితే వేలిముద్రలు లేకపోతే ఎలా ఉంటుందనే ప్రశ్న వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే దేశంలోని కొన్ని కుటుంబాల్లో నివశిస్తున్న ప్రజలకు చేతులు, చేతివేళ్లు బాగానే ఉన్నా వేళ్లపై వేలిముద్రలు మాత్రం లేవు. బంగ్లాదేశ్ లో నివశిస్తున్న కొన్ని కుటుంబాల్లోని ప్రజలు వేలిముద్రలు లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇలా వేలిముద్రలు లేకపోవడం జన్యు సమస్య వల్ల జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఆ గ్రామంలో 80 శాతం మంది జనవరి 1నే పుట్టారు.. ఎలా సాధ్యమైందంటే..?
smarcad1 అనే జన్యువు లోపించడం వల్ల ఈ స్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. వేలి ముద్రలు లేని అమల్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ వేలిముద్రలు లేకపోవడం వల్ల తాను డ్రైవింగ్ లైసెన్స్ ను పొందలేకపోతున్నానని తెలిపారు. డ్రైవింగ లైసెన్స్ లేకపోవడం వల్ల ప్రతిసారి డ్రైవింగ్ వచ్చినా జరిమానా చెల్లించాల్సి వస్తోందని అమల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అమల్ తో పాటు అతని సోదరుడు అపుల్ సైతం వేలిముద్రలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలా చిన్న సమస్యలా అనిపించిన ఈ సమస్య ఉన్నవాళ్లు పడే ఇబ్బందులు అన్నీఇన్ని కావు. ఇలా బంగ్లాదేశ్ లో పదుల సంఖ్యలో ప్రజలు వేలిముద్రలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
