https://oktelugu.com/

The Kerala Story Controversy :’కేరళ స్టోరీ’ సినిమా విడుదలకు ముందే ఎందుకింత రాద్ధాంతం?

అసలు సినిమా చూడకుండానే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారు. 'కేరళ స్టోరీ' సినిమా విడుదలకు ముందే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణ పైన వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2023 / 08:44 PM IST
    Follow us on

    The Kerala Story Controversy : కేరళ పర్యాటక ప్రాంతం.. అరేబియా సముద్రం ఒడ్డున ఉండే చిన్న రాష్ట్రం. దక్షిణాదిలోనే అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్న రాష్ట్రం కూడా ఇదే. ఇక్కడ కమ్యూనిస్టు లేదా కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి అక్కడ అధికారాన్ని చెలాస్తున్నాయి. కమ్యూనిస్టుల పాలన ఎలా ఉంటుందో తెలుసు కదా? బీఫ్ ఫెస్టివల్, కిస్ ఫెస్టివల్ అలాంటివి సర్వసాధారణం అక్కడ. అలాంటి రాష్ట్రంలో ఉగ్రవాద జాడలు కూడా ఎక్కువే.. ఈమధ్య పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఉగ్రవాద మూక తన కార్యకలాపాలు కేరళ కేంద్రంగా సాగిస్తూ ఉంటే.. అక్కడి పోలీస్ ఇంటలిజెన్స్ మౌనంగా ఉండిపోయింది. ఏదో కేసు నిమిత్తం నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విచారణ జరుగుతుంటే దాని మూలాలు కేరళలో ఉన్నట్టు కనిపెట్టింది. వెంటనే దానిని తవ్వడం మొదలు పెడితే పెద్ద పెద్ద తలకాయలు అందులో ఉన్నట్టు తేటతెల్లమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడి ఎర్ర సర్కారు ఉదారవాదం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.

    పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉగ్రవాదం మూక మాత్రమే కాదు.. లవ్ జిహాద్ కూడా కేరళలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ఈ తరహా కేసుల్లో కేరళ ప్రథమ స్థానంలో ఉంది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ఆర్టిఐ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం కేరళ రాష్ట్రంలో 32 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు సాధించిన పురోగతి కూడా ఏమీ లేదు. పైగా ఈ అదృశ్యమైన 32 వేల మంది అమ్మాయిలు ఇస్లాం మతంలోకి మారారు. పైగా వారంతా దేశ వ్యతిరేక కుట్రలో భాగస్వాములు అయ్యారు. స్థూలంగా చెప్పాలంటే ఉగ్రవాదులుగా మారిపోయారు. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని వారిని ప్రేమ మత్తులోకి దింపి, వారితో మతం మార్పిస్తున్నారు. తర్వాత వారిని ఇతర దేశాలకు తరలించి అక్కడ ఉగ్రవాదంలో శిక్షణ ఇప్పించి భారత్ మీద దాడికి ఉసిగొలుపుతున్నారు..

    అయితే ఈ పరిణామాలపై గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. అక్కడి ప్రభుత్వ ఉదారవాదం వల్ల దేశ అంతర్గత భద్రతకే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా వీటికి వ్యతిరేకంగా ఎవరైనా పోరాటం చేస్తే వారిపైన కేసులు పెట్టడం లేదా అంతమొందించడం జరుగుతోంది. ఫలితంగా అక్కడ ఉగ్రవాదం పెచ్చ రెల్లిపోతోంది.

    ఇలాంటి ఘటనలపై గత ఏడు సంవత్సరాలుగా సుదీప్తో సేన్ అనే దర్శకుడు పరిశోధన కొనసాగిస్తున్నాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎంతమంది అమ్మాయిలు అపహరణకు గురయ్యారో సమాచారం తీసుకొని మరి ఈ కేరళ ఫైల్స్ అనే సినిమాను రూపొందించాడు.. అదా శర్మ, సిద్ది ఇదాని, యోగితా వంటి వారు ఈ సినిమాలో ముఖ్యపాత్రులు పోషించారు. కొంతమంది హిందూ, క్రైస్తవ అమ్మాయిలు చదువు, ఉద్యోగం కోసం కేరళ ప్రాంతంలోని మారుమూల గ్రామాల నుంచి నగరాలకు వస్తారు. అక్కడ కొంతమంది ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన మహిళలు వీరిని ఇస్లాం మతంలోకి మారేలా చేస్తారు. అనంతరం ఉగ్రవాద గ్రూప్ కి సంబంధించిన అబ్బాయిలు వారిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకొని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్లి వారితో ఉగ్రవాద వ్యవహారాలు చేయిస్తారు. అయితే ఇలా జరుగుతున్నట్టు ఎవరికీ తెలియదు. తమ పిల్లలు కనపడకుండా పోయారని తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసి బాధపడతారు.” ఇలాంటి ఘటనల నేపథ్యంలోనే సుదీప్తో సేన్”ది కేరళ స్టోరీ “సినిమా రూపొందించాడు.

    దీనికి సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ రేకెత్తిస్తోంది. అయితే దీనిపై కేరళ ప్రభుత్వం మండిపడుతోంది. రాష్ట్రంలో మతకల్లోలలు సృష్టించేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా తోడు కావడంతో వివాదం మరింత రంజుకుంది. అయితే ఈ సినిమాను నిషేధించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

    అసలు సినిమా చూడకుండానే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారు. ‘కేరళ స్టోరీ’ సినిమా విడుదలకు ముందే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణ పైన వీడియోలో చూడొచ్చు.