Terrorism in Kashmir : దేశంలో ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండా జమ్మూ కశ్మీర్‌కు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం కలిగింది. ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అల్లర్లు తగ్గాయి. 90వ దశకంలో ఉన్న పరిస్థితి ఉప్పుడు పూర్తిగా మారిపోయింది. మోదీ చెప్పినట్లు బుల్లెట్ ప్రూఫ్ లేకుండా వెళ్లి కశ్మీర్‌లో జాతీయ పతాకం ఎగురవేసేలా పరిస్థితులు మారిపోయాయి.
వాస్తవానికి పుల్వామా దాడి తర్వాత నరేంద్ర మోడీ కాశ్మీర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అజిత్ దోవల్ నాయకత్వంలో భద్రత దళాలను మరింత పరిపుష్టం చేశారు. సరిహద్దులో చొరబాట్లను నియంత్రిస్తూనే, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఉగ్రవాదులకు నగదు సరఫరాకు కళ్లెం వేశారు. ఫలితంగా వారి ఆగడాలు తగ్గుముఖం పట్టాయి.
ఇదే నేపథ్యంలో పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో మోడీ ఏం కోరుకున్నాడో అది జరగడం ప్రారంభమైంది. మరోవైపు కేంద్రం భరోసా మెండుగా ఇవ్వడంతో కార్పొరేట్ కంపెనీలు కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. ఉగ్రవాదుల దాడులతో నిత్యం భీతిల్లిన కాశ్మీరీ ప్రజలకు వినోదం కోసం సినిమా థియేటర్లను ప్రారంభించడం మొదలైంది. ఇందులో భాగంగా ఐనాక్స్ కంపెనీ రామ్ మున్షిబాగ్ లో పెద్ద థియేటర్ నిర్మించింది. ఇందులో ప్రదర్శితమయ్యే సినిమాలు చూసేందుకు జనం భారీగా వస్తున్నారు.
మారుతున్న కశ్మర్ పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..