The Indrani Mukerjea Story :
“కర్రీ అండ్ సైనెడ్ : దీ జూలీ జోసెఫ్ కేస్” అనే డాక్యుమెంటరీ తీసి సంచలనం సృష్టించిన నెట్ ఫ్లిక్స్.. మరో వివాదాస్పద డాక్యుమెంటరీతో ముందుకు వచ్చింది. ఓటీటీ విభాగంలో అనేక ప్రయోగాలు నెట్ ఫ్లిక్స్.. డాక్యుమెంటరీలు కూడా నిర్మిస్తోంది. ఆస్కార్ పురస్కారం పొందిన ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ లో ఉంచిన నెట్ ఫ్లిక్స్.. “కర్రీ అండ్ సైనెడ్ : దీ జూలీ జోసెఫ్ కేస్” పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. తన విలాసాలకు సొంత కుటుంబం, ఇతర వ్యక్తులను అంతమొందించిన జాలీ జోసెఫ్ జీవిత కథ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ రూపొందించింది. ఇది సంచలన విజయం సాధించడంతో..నెట్ ఫ్లిక్స్ వాస్తవ జీవిత గాథల ఆధారంగా డాక్యుమెంటరీలు నిర్మిస్తోంది. 2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యోదంతం పై డాక్యుమెంటరీ తీస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ అప్పట్లో ప్రకటించింది. దానికి ది ఇంద్రాణి ముఖర్జీయా స్టోరీ అని పేరు పెట్టింది (the Indrani Mukherjea buried truth) అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను నెట్ ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసింది. అప్పట్లో విడుదలైన ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించింది. దీంతో ఈ డాక్యుమెంటరీ పై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ డాక్యుమెంటరీ కి సంబంధించి ట్రైలర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.
సోమవారం విడుదలైన ఈ ట్రైలర్ లో పలు ఆసక్తికరమైన విషయాలను నెట్ ఫ్లిక్స్ బహిర్గతం చేసింది. 2015 లో షీనాబోరా అనే యువతి హత్యకు గురైంది. ఈ ఉదంతం వెనక అనేక నాటకీయ పరిణామాలున్నాయి. కన్నతల్లి కూతుర్ని హతమార్చిన తీరు దేశవ్యాప్తంగా ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఏప్రిల్ 2012 సంవత్సరంలో 24 సంవత్సరాల షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కారులో అత్యంత పాశవికంగా ఆయుధంతో గొంతు కోసి చంపారు. ఆ తర్వాత ఆ యువతీ మృతదేహాన్ని రాయ్ గడ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కాల్చేశారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిని దర్యాప్తు చేస్తుంటే కొత్త కొత్త విషయాలన్నీ వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా సంచలనం నమోదయింది. ఈ ఘటనకు కారణమైన ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. 2022 మే నెలలో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఇంద్రాణిముఖర్జీ తన కూతురు షీనా బోరాను హత్య చేయడానికి గల కారణాల పై నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ రూపొందించింది..
ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 23 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇందులో ఉత్తరాది ప్రాంతానికి చెందిన షానా లెవీ, ఉరాజ్ బహల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మెయిన్ సినిమాల కంటే డాక్యుమెంటరీలు బహుళ ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో.. నెట్ ఫ్లిక్స్ ఈమధ్య వాస్తవ జీవిత కథల ఆధారంగా డాక్యుమెంటరీలు నిర్మిస్తోంది. కేరళలో వరస హత్యలు చేసి సంచలనం సృష్టించిన జాలి జోసెఫ్ జీవిత కథ ఆధారంగా కర్రీ అండ్ సైనైడ్ అనే డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ రూపొందించింది. అది సంచలన విజయం సాధించడంతో షీనా బోరా హత్యోదంతాన్ని డాక్యుమెంటరీగా తీసింది. సోమవారం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది.
Behind closed doors, this family conceals more than just secrets. Dive into the murder case that once sent shockwaves across the nation in The Indrani Mukerjea Story: Buried Truth, releasing on 23 February only on Netflix. pic.twitter.com/cxQKq9hTeq
— Netflix India (@NetflixIndia) February 12, 2024