Tollywood Lucky Heroine: మన ముగ్గురు స్టార్ హీరోస్ కెరియర్ నిలబెట్టింది ఆ హీరోయిన్ సినిమాలే..

మహేష్ బాబు పోకిరి , శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇస్తే, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌,‌అత్తారింటికి దారేది లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు.

Written By: Swathi, Updated On : July 31, 2023 8:44 am

Tollywood Lucky Heroine

Follow us on

Tollywood Lucky Heroine: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న నెంబర్ వన్ చైర్ కి ఎక్కువ పోటీ పడుతున్న హీరోలు మాత్రం ముగ్గురు. వాళ్ళు ఎవరు అంటే టక్కున పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న ఈ హీరోలు వాళ్ళ వాళ్ళ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకున్నారు. అంతే కాదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు.

మహేష్ బాబు పోకిరి , శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇస్తే, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌,‌అత్తారింటికి దారేది లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏమీ తక్కువ కాదు ఆది, సింహాద్రి, బృందావనం లాంటి సూపర్ హిట్ కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి మరుపురాని హిట్లు ఇస్తున్న ఈ ముగ్గురు హీరోల కి వాళ్ళ కెరియర్ లో వాళ్ళని స్టార్ గా మార్చిన సినిమాలు మూడు ఉన్నాయి. ఈ చిత్రాల్లోని విశేషం ఏమిటి అంటే ఈ మూడు చిత్రాల్లో హీరోయిన్ ఒక్కరే. అవును ఈ ముగ్గురి కెరీర్ ని తారాస్థాయికి తీసుకెళ్ళింది ఆ హీరోయిన్ సినిమాలే. మరి ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి చూద్దాం.

ముందుగా మన పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బద్రి, తమ్ముడు లాంటి సూపర్ హిట్లు తన కెరియర్ ప్రారంభంలో ఉన్నా కానీ పవన్ ని స్టార్ గా మార్చిన చిత్రం మాత్రం ఖుషి. ఈ సినిమా 2001 లో విడుదల అయ్యి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఆయన్ని అమాంతంగా టాప్ వన్ పొజిషన్లో నిలబెట్టింది.

ఇక ఆ తర్వాత మన సూపర్ స్టార్ విషయానికి వస్తే, మహేష్ బాబు కెరీర్ ని మార్చేసిన సినిమా ఒక్కడు. ఈ సినిమా 2003 లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు దాకా ప్రేమకథలే చెయ్యగలడు అన్న మహేష్ బాబుని అటు క్లాస్ ఇటు మాస్ మెచ్చే నెంబర్ వన్ తెలుగు హీరో గా మార్చేసింది. ప్రిన్స్ గా పిలుచుకునే మహేష్ ఈ సినిమాతో ఏకంగా సూపర్ స్టార్ అయిపోయారు.

అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వచ్చిన సింహాద్రి సినిమా అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2003లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. మన యంగ్ టైగర్ ని ఏకంగా టాప్ వన్ పొజిషన్ పోటీ పడేల చేసిన మొదటి సినిమా ఏది అంటే అది సింహాద్రి అని చెప్పాలి.

మరి ఈ ముగ్గురు హీరోలని నిలబెట్టిన 3 బ్లాక్ బస్టర్ సినిమా పేర్లు వినగానే ఇందులో కామన్ పాయింట్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అది ఏమిటి అంటే ఈ మూడు సెన్సేషన్ సినిమాలలో హీరోయిన్ ఒకరే. అది మరి ఎవరో కాదు హీరో హీరోయిన్ భూమిక. ప్రస్తుతానికి భూమిక కి అంత క్రేజ్ లేకపోయినా, ఏవో కొన్ని చిత్రాల్లో మాత్రమే కనిపిస్తున్న, ఒకప్పుడు మాత్రం భూమిక టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉండేవారు.

ముగ్గురు టాప్ హీరోస్ కెరియర్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూడు సినిమాల్లో నటించి అప్పట్లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, కొన్ని సినిమాలలో ముఖ్యపాత్రలో కనిపించి మెప్పిస్తోంది భూమిక.