పాకిస్తాన్ కు పక్కలో బల్లెంలా అప్ఘనిస్తాన్ మారిపోయింది. ఈ విషయంలో భారత్ పాత్ర ఏమాత్రం లేదు. పాక్ ను అప్ఘన్ ఇప్పుడు చీల్చబోతోంది. మొదటి దెబ్బ వేయబోతోంది . దీనికి చాలా కారణాలున్నాయి. ప్రధాన మైన కారణం 130 సంవత్సరాల పగ. ఒకనాడు బ్రిటీషర్ల మీద.. ఇప్పుడు పాకిస్తాన్ మీద అప్ఘనిస్తాన్ పగ బట్టింది. ఆ పగను పాక్ పై అప్ఘన్ తీర్చుకోబోతోంది..
1893 నవంబర్ 12వ తేదీ అప్ఘన్ చరిత్రలో చీకటి రోజు. అప్ఘన్ ను పాలించిన అమీర్ అబ్దుల్ రెహమాన్ కు.. అప్పటి బ్రిటీష్-భారత విదేశాంగ కార్యదర్శి డ్యూరండ్ కు మధ్య జరిగిన చీకటి ఒప్పందం చిచ్చుపెడుతోంది.. అప్ఘనిస్తాన్ – పాకిస్తాన్ విభజనను నాడు బ్రిటీషర్లు సరిగ్గా చేయలేదు. ఇరు దేశాల మధ్య విభజనను నిట్టనిలువునా చీల్చారు. 50శాతం బ్రిటీష్ ఇండియాకు.. 50శాతం అప్ఘనిస్తాన్ కు ఇచ్చేశారు. గ్రేట్ గేమ్ లో రష్యాను దెబ్బకొట్టేందుకు అప్ఘనిస్తాన్ లోని కొంతభాగాన్ని చీల్చారు.
మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ని చీల్చాలనుకుంటుంది.. ? అసలు ఈ రెండు దేశాల మధ్య విభజన ఎలా జరిగింది? బ్రిటీషర్లు చేసిన ఎత్తులు పైఎత్తులు ఏంటి? స్వాతంత్య్రానికి పూర్వం విభజించిన తీరుపై నాటి చరిత్రను వివరిస్తూ ‘రామ్’ గారు చేసిన సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..