Revanth Reddy – RK : రేవంత్ ను రాధాకృష్ణ అందుకే లేపాడా?

మొత్తం మీద.. రాధా కృష్ణ తన ఛానెల్‌ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి రేవంత్ ను ఇంటర్వ్యూ చేయడం ద్వారా భారీ వ్యూయర్‌షిప్‌ను అందించారని చాలా స్పష్టంగా తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : January 9, 2024 8:15 pm
Follow us on

Revanth Reddy – RK :  రాధాకృష్ణ అవసరం.. రేవంత్ ప్రభావం.. ఈ ఇద్దరికి కావాల్సిన అవే కాబట్టి ఆ తొలి ఇంటర్వ్యూ పండింది.  రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణకు తొలి మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది రాధా కృష్ణ కావాలనే రేవంత్ రెడ్డి మేనియాను బాగా పెంచేలా డిజైన్ చేసిన ఇంటర్వ్యూగా కనిపించింది. ఎందుకంటే ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నలను సంధించడంలో రాధాకృష్ణ సిద్ధహస్తుడు..

సాధారణంగా ఇలాంటి ఇంటర్వ్యూలలో రాధాకృష్ణ చాలా క్యాజువల్‌గా ప్రశ్నలు అడగడంతోపాటు తెలివిగా సమాధానాలు రాబట్టే నేర్పు కలవాడు. గతంలో రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్నందున రాధా కృష్ణ ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రశ్నలు వేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా వాటికి తేలికగా సమాధానం ఇచ్చాడు.. ఇది ఏ సాధారణ వీక్షకుడైనా గమనించాడు..

అయితే రేవంత్ రెడ్డితో తాజాగా నిర్వహించిన ఆర్కే ఇంటర్వ్యూను నిశితంగా పరిశీలిస్తే ఇది స్టేజ్ మేనేజ్‌మెంట్ షోనా అని ఆశ్చర్యపోయమానదు.. ఈ ఇంటర్వ్యూ మొత్తం ముఖ్యమంత్రి ఇమేజ్‌ను ఎలివేట్ చేయడం.. కాంగ్రెస్ పార్టీలో ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టడమే లక్ష్యంగా కనిపించింది. కాంగ్రెస్‌ హైకమాండ్‌కి రేవంత్‌ అత్యంత సన్నిహితుడని, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, అధినేతగా మరో ఐదేళ్ల వరకు ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని.. సాధారణ కాంగ్రెస్‌ నాయకుడు లేదా కార్యకర్త భావించే విధంగా తెలివిగా రాధాకృష్ణ ప్రశ్నలు సంధించారు.

కనీసం మంత్రి కాకుండా… రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పార్టీలో తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగానో, సీనియర్లుగా చెప్పుకునే ఇతర వ్యక్తుల కంటే రేవంత్ రెడ్డి తనకున్న అనుకూలతలను కూడా ఇందులో వివరించేలా చేయడంలో ఆర్కే సక్సెస్ అయ్యాడు.

ఇక తెలంగాణలో మహారాష్ట్ర తరహాలో బీజేపీ.. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి బీఆర్ఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారని రాధాకృష్ణ ఉద్దేశపూర్వకంగా ప్రశ్నించారు. “నేను జానా రెడ్డిని కాదు. అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తే.. నేనూ ఏ మేరకు వెళ్లగలనో చూపిస్తాను’’ అని రేవంత్ రెడ్డి, పేర్కొన్నారు. పరోక్షంగా గతంలో సీఎల్పీ నేతగా జానా రెడ్డి ఉన్న 2019లో ఆయన అసమర్థత వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడానికి ఎలా దారి తీసిందో రేవంత్ దెప్పిపొడిచారు.

మొత్తం మీద.. రాధా కృష్ణ తన ఛానెల్‌ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి రేవంత్ ను ఇంటర్వ్యూ చేయడం ద్వారా భారీ వ్యూయర్‌షిప్‌ను అందించారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి తన స్థానాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ముఖ్యమంత్రిగా మార్చలేరని తేల్చిచెప్పారు.