AP SSC Results – JanaSena: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇటీవల ఘనంగా తమ విద్యావ్యవస్థ గురించి గొప్పలు చెప్పుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో.. మీడియాను అంతా పిలిచి కొంతమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ఇంగ్లీష్ లో మాట్లాడించి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ చాలా అద్భుతంగా ఉందని ప్రకటించారు. దీని తర్వాత వైసీపీ అనుకూల మీడియా చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. ఏపీవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ‘ఇంగ్లీష్ ’లో మాట్లాడించి ఇదంతా జగన్ సర్కార్ పెట్టిన ‘ఇంగ్లీష్ మీడియం’ ఘనతేనని గొప్పగా చాటారు. సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసింది. అయితే తాజాగా విడుదలైన పదోతరగతి పరీక్ష ఫలితాలు వైసీపీకి షాకిచ్చాయి. ఇంత దారుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయాయా? అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్నట్టుగా పరిస్థితి మారింది.

తాజాగా ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు తల్లిదండ్రులకు, రాజకీయ పార్టీలకు కూడా షాక్ ఇచ్చాయి. దాదాపు 32 శాతం విద్యార్థులు ఈసారి ఫెయిల్ కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ పరిణామాలపై జనసేన పార్టీ తాజాగా స్పందిస్తూ కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చింది.
Also Read: Woman Was Found Chopped: క్రైమ్ మిస్టరీ: ప్రేమించి పెళ్లాడి ఆమెను అతడు ఎందుకు చంపాడు..
పదోతరగతి ఫలితాలు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగా జనసేన అభివర్ణించింది. పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల వద్ద నుంచి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా 2,01,627(32.74 శాతం) మంది పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడం ప్రభుత్వ వైఫల్యమేనని.. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడం.. పరీక్షల సమయంలో పేపర్లు లీక్ కావడం తదితర కారణాలు విద్యార్థులపై ప్రభావం చూపుతాయని అన్నారు.
విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వ హయాంలో 71 పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాకపోవడం.. అందులో 22 ప్రభుత్వ పాఠశాలలే ఉండడం సిగ్గుచేటు అని జనసేన కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

ప్రభుత్వ పాఠశాలల మార్క్స్ షీట్ లలో మరీ దారుణంగా ఉపాధ్యాయులు వ్యవహరించారు. పాస్ అయిన సబ్జెక్టులకు ‘ఎఫ్’ అని.. ఫెయిల్ అయిన విద్యార్థులకు ‘పీ’ అని పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి కారణమైంది. ఇది ప్రభుత్వ వైఫల్యంగా జనసేన ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఎండగడుతోంది.
ఈ క్రమంలోనే జనసేన కొత్త డిమాండ్ చేస్తోంది. ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయకుండా పూర్తిగా ఉచితంగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
పదోతరగతి ఫలితాల విషయంలో ఇప్పుడు వైసీపీ డిఫెన్స్ లో పడింది. బయటకు చెప్పుకోవడానికి.. లోపల జరుగుతున్నదానికి చాలా తేడా ఉందని నిరూపితమైంది. దీన్నే జనసేన ముందుకు తీసుకెళ్లడానికి యోచిస్తోంది. వైసీపీ విద్యావ్యవస్థ డొల్లతనాన్ని బయటపెట్టేందుకు సిద్ధమైంది.
Also Read:Madin India Products: మేడిన్ ఇండియా ఉత్పత్తులు బ్యాన్
[…] […]
[…] […]