Telangana Secretariat Sunked: కొత్త సెక్రటేరియేట్‌కు కాళేశ్వరం నీళ్లు.. అందులో ఈత కూడా కొట్టొచ్చు!!

సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లు తెస్తా.. ఇంటింటికీ సరఫరా చేస్తాం. జంట జలాశయాలతో పనిలేదు.. అందుకే 111 జీవో ఎత్తేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. కేసీఆర్‌ మాట ఇచ్చి చేయకుంటే తల నరుక్కుంటారు కదా.. అందుకే తల నరుక్కోవడం ఎందుకని.. మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా కాళేశ్వరం జలాలను ఇలా హైదరాబాద్‌కు తెప్పించినట్లు అనిపిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : July 25, 2023 5:00 pm

Telangana Secretariat Sunked

Follow us on

Telangana Secretariat Sunked: డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.. ఇదెక్కడుంది అనుకునేరు.. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాత సెక్రటేరియేట్‌లో తనకు అచ్చిరాదని.. సుమారు రూ.900 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం.. అదే నూతన సెక్రేరియేట్‌.. రాజస్థాన్‌ శిలలతో.. డోములతో.. రాజరికపు శోభ ఉట్టిపడేలా.. ఇంద్ర భవనాన్ని తలపించేలా నిర్మించిన భవనం ఇది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌ దీనిని ఆర్భాటంగా ప్రారంభించారు. ఆరు అంతస్తులతో నిర్మించిన ఈ భవనం.. ప్రారంభించిన కొన్ని రోజులకే నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో భవనంపై నీరు భారీగా నిలిచింది. వెంటనే కూలీలను రప్పించి నిలిన నీటిని యాతం పోస్తున్నట్లు ఎత్తిపోయించారు. అప్పుడు వేసవి కాబట్టి అలా చేశారు. మరి ఇప్పుడు వర్షాకాలం.. వరణుడి కాలం.. భవనంపై ఎందుకు అనుకున్నాయో ఏమో… ఏకంగా కాళేశ్వరం గంగను తలపించేలా వరద సెక్రటేరియేట్‌ను చుట్టుముట్టింది.

చెప్పినట్లే చేశారు..
సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లు తెస్తా.. ఇంటింటికీ సరఫరా చేస్తాం. జంట జలాశయాలతో పనిలేదు.. అందుకే 111 జీవో ఎత్తేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. కేసీఆర్‌ మాట ఇచ్చి చేయకుంటే తల నరుక్కుంటారు కదా.. అందుకే తల నరుక్కోవడం ఎందుకని.. మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా కాళేశ్వరం జలాలను ఇలా హైదరాబాద్‌కు తెప్పించినట్లు అనిపిస్తోంది.

భారీ వర్షాలకు స్విమ్మింగ్‌ పూల్‌లా..
రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ తీరంలోని కొత్త సెక్రటేరియేట్‌ ప్రాంగణమంతా స్విమింగ్‌ పూల్‌ను తలపిస్తోంది. మోకాలు లోతు నీరు నూతన భవనం చుట్టూ నిలిచింది. వర్షపు నీరంతా భూమిలో ఇంకేలా పెద్దపెద్ద ఇంకుడు గుంతలు, అండర్‌ గ్రౌండ్‌ ట్యాంకులు నిర్మించామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. పరిస్థితి చూస్తుంటే.. ఇంకుడు గుంతలోమో కానీ.. స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించినట్లు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు

సోషల్‌ మీడియాలో వైరల్‌..
సెక్రటేరియేట్‌ను చుట్టుముట్టిన వరదకు సబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై విపక్షాలతోపాటు ప్రజలు కామెంట్‌ చేస్తున్నారు. రూ.900 కోట్లు కాళేశ్వరం నీళ్లలో పోసినట్లేనా.. కేసీఆర్‌ కాళేశ్వరం జలాలను తన ఫామ్‌హౌస్‌కు తెచ్చుకున్నట్లుగానే.. ఇప్పుడు నేరుగా సెక్రటేరియేట్‌కు తెచ్చారు.. సూపర్‌పో.. విశ్వనగరంలో ఇది కామనే.. అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక విపక్షాలు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నాయి.