Telangana Politics : రెండు రోజుల క్రితం కుతుల్బాపూర్ లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్టీవీ ‘గెలుపు ఎవరిది?’ అనే పేరుతో ప్రజల ముందు పబ్లిక్ మీటింగ్ పెట్టింది. దాంట్లో పోటీచేస్తున్న ప్రధాన అభ్యర్థులను నిలబెట్టి క్వశ్చన్, ఆన్సర్ కార్యక్రమాలను నిర్వహించారు. మొదట ఈ కార్యక్రమం బాగా జరిగింది. యాంకర్లు, జర్నలిస్టులు, ప్రజలు వేసిన ప్రశ్నలకు ఎమ్మెల్యే అభ్యర్థులు సరిగ్గా సమాధానం ఇచ్చారు. బాగా జరుగుతోందని అందరూ అనుకున్నారు.
కుతుల్బాపూర్ ప్రజల్లో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పనితీరు, అవినీతిని ఎలుగెత్తి చాటారు. దీన్నే బీజేపీ నేత ప్రశ్నించే సరికి బీఆర్ఎస్ అధికార ఎమ్మెల్యే తట్టుకోలేకపోయాడు. ఏకంగా వాదించిన బీజేపీ అభ్యర్థి గొంతు గట్టిగా పట్టుకొని కొట్టాడు.
నిజానికి ఈ డిబేట్ చూసి ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు వేయాలన్నది నిర్ణయించుకుంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరు చూశాక ఆయన అధికార మదం, దాదాగిరి మనస్తత్వం బయటపడింది.
తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తుంది అధికార మదం, దాదాగిరీ మనస్తత్వం కాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.