Telangana Exit Poll Results : అధికార మార్పిడికి ఒకే, సామాజిక మార్పుకు మాత్రం ఇంకా టైముంది

అధికార మార్పిడికి ఒకే, సామాజిక మార్పుకు మాత్రం ఇంకా టైముందని.. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 2, 2023 5:39 pm

Telangana Exit Poll Results : అందరూ ఆతృతగా ఎదురుచూసిన మై యాక్సిస్ ఇండియా పోల్ విడుదలైంది. మిగతా అన్నింటిని పక్కనపెట్టి దేనికోసమైతే ఎదురుచూశామో ఆ ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చేసింది. కాంగ్రెస్ గాలి గట్టిగా వీచిందని మై యాక్సిస్ సర్వే కూడా తేల్చిచెప్పింది. ఈ గాలిని తట్టుకొని నిలబడింది కేవలం హైదరాబాద్ నగరం మాత్రమేనని చెప్పింది. దానికి కారణాలు ఏంటంటే.. హైదరాబాద్ లో గతంలో బాగా బలహీనంగా ఉంది. అది బీఆర్ఎస్ ను దెబ్బతీసేంతగా వీయలేదు. దీన్ని బట్టి మనం హైదరాబాద్ లో బీఆర్ఎస్ గట్టిగానే ఉందని తేలింది.

దేశంలో పేరు మోసిన సర్వే సంస్థల్లో మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్ ఒకటి. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ కు సంబంధించి ఆలస్యంగా ఫలితాలు వెల్లడించింది. అందులో భాగంగా తెలంగాణ ఫలితాలను సైతం ప్రకటించింది. అయితే ఏ ప్రాంతంలో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అన్నది పూర్తి గణాంకాలతో సహా వెల్లడించడం విశేషం. పూర్తి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే ఈ సర్వే సంస్థ ఫలితాలు రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఈ ఫలితాలు ఉన్నాయని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందని అనుకుంటే.. కాంగ్రెస్ గాలికి ఉత్తర తెలంగాణలో కూడా బలంగా వీచింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చాయి. కానీ మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్ సంస్థ మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుందని వెల్లడించడం విశేషం. ఆ పార్టీకి 63 నుంచి 73 సీట్లు వరకు వస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఒక్క హైదరాబాదులో మినహాయించి.. మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని వెల్లడి కావడం విశేషం.

బీఆర్ఎస్ పార్టీ 34 స్థానాలతో సరిపెట్టుకుంటుందని.. ఒకవేళ త్రిముఖ పోటీలో మరో 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అంతకుమించి సీట్లు రావని కూడా స్పష్టం చేసింది. బిజెపి సైతం నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుందని తేల్చేయడం విశేషం. అయితే ఈసారి మజ్లిస్ కు సైతం ఒక స్థానం తగ్గనుందని సర్వే తేల్చింది. ఆ పార్టీ నాంపల్లి సీటును కోల్పోవడం ఖాయమని స్పష్టం చేసింది.

అధికార మార్పిడికి ఒకే, సామాజిక మార్పుకు మాత్రం ఇంకా టైముందని.. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Tags