Pawan Kalyan Congress: రాజకీయ అవసరాల కోసం ఎన్నైనా జిమ్మిక్కులు చేయొచ్చు. కానీ ఎన్నికలు లేకపోయినా.. ఓట్లు అడగకుండా చేసే సాయాలే గొప్ప. పైగా సొంత డబ్బులు వెచ్చించి మరీ చేస్తున్న సాయం మాటలకు అందనిది. అలాంటి గొప్ప సాయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో చేస్తున్నారు. ఏపీలో మరణించిన కౌలురైతులకు నిస్వార్థంగా కోట్ల రూపాయాలను పంచుతున్న పవన్ మానవతాసాయానికి ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను కౌలురైతు కుటుంబాలు దేవుడిగా కొలుస్తున్నాయి..

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా జనసేన బాటలో నడుస్తోంది. ఏపీలో మరణించిన కౌలు రైతులు, జనసైనికులను పవన్ ఎలా ఆదుకుంటున్నాడో అచ్చం అలాగే తెలంగాణ కాంగ్రెస్ ముందుకొచ్చింది.. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ కాంగ్రెస్ ట్రెండ్ ను ఫాలో అవుతోంది. ఆపదలో ఆదుకుంటే కలకాలం గుర్తుంటుంది. అదే పవన్ చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పవన్ బాటలోనే పయనిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాజాగా ‘రాజీవ్ గాంధీ ప్రమాద భీమా పథకం’ పేరుతో ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇతర పేదలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీభవన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ తోపాటు నేతలు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి, పీఏసీ, ప్రచార , ఎలక్షన్ ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్లు, కాంగ్రెస్ నేతలంతా ఇందులో పాల్గొంటున్నారు.
ఇలా ఏపీలో పవన్ వితరణ ఎంతో సక్సెస్ అయ్యింది. పవన్ చేస్తున్న సాయం ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ నడుస్తోంది. వేయి మాటలకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడిని పుణికి పుచ్చుకొని సాగుతున్న ఈ సాయం ప్రస్థానం ఈ రెండు పార్టీలకు రెండు రాష్ట్రాల్లో మంచి మైలేజ్ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.