Telangana Cabinet : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. సంక్షేమ పథకాల అమలులో ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు త్వరలోనే ఫలించబోతోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం(మార్చి 12న) నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు కమిటీని నియమిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జస్టిస్ పినాకిని చంద్రబోస్‌ను విచారణ కమిటీ చైర్మన్‌గా నియమించారు. 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనోగుళ్లపైనా విచారణ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో 93 శాతం రైతులకు రైతుబంధు అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
క్యాబినెట్ నిర్ణయాలు ఇవీ..
– కొత్త రేషన్‌కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్
– మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు
– హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణ
– ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
– కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు.
– భద్రాద్రి కొత్తగూడెం, యాదత్రి పవర్ ప్లాంట్లపై రిటైర్డ్ జడ్జితో విచారణ.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలక కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు.
– మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఆమోదం. ఇందుకు రూ.22,500 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్.
– 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు నిర్ణయం.
– మహిళా సంఘాలు తయారు చేసే వస్తువలను బ్రాండింగ్ చేయడానికి ఓఆర్‌ఆర్ చుట్టూ 30 ఎకరాల స్థలం కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయం.