https://oktelugu.com/

Telangana BJP : టాప్‌–30 సీట్లకు అభ్యర్థులు వీరే.. తెలంగాణ గెలుపు ప్లాన్‌ రెడీ చేసిన అమిత్‌షా

ఒకవైపు అమిత్‌షా విన్నింగ్‌ ఫార్ములా, మరోవైపు అధిష్టానం అండతో రాష్ట్ర నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 75 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని రాష్ట్ర నేతలకు సూచించింది.

Written By: NARESH, Updated On : August 2, 2023 9:59 pm
Follow us on

Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉంది. ఈ ఏడాది చివరన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్‌తోపాటు, విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. హ్యాట్రిక్‌ కొట్టాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ అంటోంది. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతోంది. దీంతో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధికార బీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్‌ కంటే ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టార్గెట్‌ 75…
ఇప్పుడు కాకపోతే.. ఎప్పుడూ కాదు అన్నట్లుగా.. తెలంగాణలో ఈసారి అధికారంలోకి రాకపోతే.. ఇంతటి ఊపు ఎప్పుడూ రాదని, ఆరు నూరైనా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో భారతీయ జనతాపార్టీ ఉంది. ఒకవైపు అమిత్‌షా విన్నింగ్‌ ఫార్ములా, మరోవైపు అధిష్టానం అండతో రాష్ట్ర నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 75 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని రాష్ట్ర నేతలకు సూచించింది.

టాప్‌ 30 వీరే..
అధిష్టానం ఆదేశాలతో తీవ్ర కసరత్తు చేసిన కమలనాథులు.. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే టాప్‌ 30 అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. ఈ లిస్ట్‌ను అధిష్టానానికి కూడా పంపించారు. ఈ జాబితాను అధిష్టానం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు తప్పితే తాజాగా బయటకు వచ్చిన జాబితా 99 శాతం వాస్తవమే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. దీంతో టాప్‌ 30 జాబితాలో ఉన్నవారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తమ నియోజకవర్గాల్లో రేపటి నుంచే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

కోల్‌కతా ఫార్ములా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌కతా ఫార్ములా అమలుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కోల్‌కత్తాలో టీఎంసీలో నంబర్‌ 2 స్థానంలో, బలమైన నేతగా, మంత్రిగా ఉన్న సువేందో అధికారిని ఎన్నికల సమయంలో బీజేపీలోకి లాక్కుంది. ఆయనను ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో సువేందో అధికారి మమతాబెనర్జీని ఓడించారు. తాజాగా తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌లో నంబర్‌ 2గా ఎదిగిన ఈటల అనూహ్య పరిణామాల మధ్య పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ అధిష్టానం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. బలమైన అభ్యర్థిని పెట్టి కేసీఆర్‌ను ఓడించాలని కమలనాథులు ఆలోచిస్తున్నారు. ఇందుకు ఈటల రెడీ అనడంతో ఆయనను గజ్వెల్‌ బరిలో నిలిపేందుకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అభ్యర్థులు నియోజకవర్గం
………………………………..
కిషన్‌రెడ్డి – అంబర్‌పేట్‌
కె.లక్ష్మణ్‌ – ముషీరాబాద్‌
బండి సంజయ్‌ – కరీంనగర్‌
ధర్మపురి అర్వింద్‌ – ఆర్మూర్‌
సోయం బాపూరావ్‌ – బోథ్‌
ఈటల రాజేందర్‌ – గజ్వేల్‌
రఘునందన్‌రావు- దుబ్బాక
డీకే.అరుణ -గద్వాల
జితేందర్‌రెడ్డి – మహబూబ్‌నగర్‌/నారాయణపేట్‌
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి – మునుగోడు
ఈటల జమున -హుజూరాబాద్‌
మురళీధర్‌రావు – వేములవాడ/కూకట్‌పల్లి
ఎన్‌.ఇంద్రసేనారెడ్డి – ఎల్బీనగర్‌
వివేక్‌ – చెన్నూర్‌
విజయశాంతి – మెదక్‌
యెండెల లక్ష్మీనారాయణ – నిజామాబాద్‌ అర్బన్‌
రామచందర్‌రావు – మల్కాజ్‌గిరి
ఎన్‌వీఎస్‌ఎస్‌.ప్రభాకర్‌ – ఉప్పల్‌
తల్లోజు ఆచారి – కల్వకుర్తి
జయసుధ – సికింద్రాబాద్‌
మహేశ్వర్‌రెడ్డి – నిర్మల్‌
రమేశ్‌రాథోడ్‌ – ఆసిఫాబాద్‌
పొంగులేటి సుధాకర్‌రెడ్డి – ఖమ్మం
బాబుమోహన్‌ – ఆందోల్‌
నందీశ్వర్‌గౌడ్‌ – పటాన్‌చెరు
కూన శ్రీశైలంగౌడ – కుత్బుల్లాపూర్‌
బూర నర్సయ్యగౌడ్‌ – భువనగిరి/ఇబ్రహీంపట్నం
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి -తాండూరు
గరికపాటి మోహన్‌ – వరంగల్‌ జిల్లా..
విక్రమ్‌గౌడ్‌ – గోషామహల్‌