BC Leaders : బీసీ రాష్ట్ర అధ్యక్షుడి కన్నా బీసీ సీఎం వాగ్ధానం గొప్పదా కాదా?

బీసీ రాష్ట్ర అధ్యక్షుడి కన్నా బీసీ సీఎం వాగ్ధానం గొప్పదా కాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 31, 2023 5:48 pm

BC Leaders : కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేశారని మొసలి కన్నీరు కారుస్తున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే వీళ్లు కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీకి మద్దతు ఇచ్చేవారా? ఇది బీజేపీ అంతరంగిక విషయం. ఆయన పదవీకాలం ముగిసింది. అందరినీ కలుపుకెళ్లే నాయకుడి కోసం బండి సంజయ్ ను పక్కనపెట్టొచ్చు. దాన్ని పెద్ద మిస్టేక్ గా ఫోకస్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. వారి 100 టికెట్లలో 20 మాత్రమే బీసీలకు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించండి. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ లో ప్రశ్నించండి. కాంగ్రెస్ అగ్రవర్ణాలు, రెడ్డిలకే ప్రాధాన్యం ఇచ్చిన అంశాన్ని ఎందుకు ప్రశ్నించరు..?

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే రెడ్డిలకు తప్ప వేరేవాళ్లకు రాజ్యాధికారం ఇవ్వడం వేస్ట్ అని చెప్పిన వ్యక్తికి బీసీలు ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? అమిత్ షా సాక్షాత్తూ తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే బీసీకి అధికారం ఇస్తామని ప్రకటించారు. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడైనా ఇప్పుడు రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్ మాత్రమే ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ కు , బీజేపీ ఇదే తేడా అన్నది మీరు ఇక్కడ గమనించాలి.

బీసీ రాష్ట్ర అధ్యక్షుడి కన్నా బీసీ సీఎం వాగ్ధానం గొప్పదా కాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.