Talasani Srinivas Yadav : ఎమ్మెల్సీని వెనక్కి లాగి కొట్టాడు.. తలసాని.. ఏందయ్యా ఇదీ?

కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటే సహించలేని తలసాని చర్యను అందరూ ఏకీపారేస్తున్నారు. తలసాని చర్యలు సరికాదంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Written By: NARESH, Updated On : August 20, 2023 8:34 pm
Follow us on

Talasani Srinivas Yadav : బీఆర్ఎస్ నేతలు కట్టుదాటుతున్నారు. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరిలో ఫస్ట్రేషన్ పెరిగిపోతోంది. ఎవరు తమను హైజాక్ చేస్తారో.. సీట్లు లాగేస్తారో అన్న భయం నెలకొంది. అందుకే నిన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి భోరుమన్నాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే సభలోనే ఆందోళన చెందాడు. ఇప్పుడు తలసాని సైతం కేటీఆర్ వెంట తిరుగుతున్న ఎమ్మెల్సీని లాగి మరీ తోసేశాడు.

హైదరాబాద్‌లో జరిగిన కేటీఆర్ పర్యటనలో మంత్రి తలసాని అత్యుత్సాహం ప్రదర్శించాడు.. కేటీఆర్ ను ఆనుకొని వెళుతున్న ఎమ్మెల్సీ ప్రభాకర్ రావుని వెనక్కి తోసేసాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తీరును అందరూ ఖండించారు. మంత్రి అయితే.. కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటే ఇలా లాగి కొడుతారా? అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటే సహించలేని తలసాని చర్యను అందరూ ఏకీపారేస్తున్నారు. తలసాని చర్యలు సరికాదంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.