Homeక్రీడలుT20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ వేదిక మార్పు..? ఇంగ్లండుకు షిఫ్ట్.. కారణం...

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ వేదిక మార్పు..? ఇంగ్లండుకు షిఫ్ట్.. కారణం ఇదే

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ వచ్చే ఏడాది జరగనుంది. ఇందుకోసం ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. 12 నెలల్లో జరగనున్న ఈ వరల్డ్ కప్ కు ముందుగా యూఎస్ఏ, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ వేదికను మార్చే అవకాశాలను పరిశీలిస్తోంది. ఐసీసీ ప్రమాణాలకు తగ్గట్లుగా ఇక్కడ మైదానాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఈ టోర్నీ నిర్వహణ మరోచోటికి మార్చాలని ఐసిసి నిర్ణయించింది.

అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లు ఆడించాలంటే ఆయా మైదానాల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలు ఉండాలి. అందుకు అనుగుణంగా ఉన్నప్పుడే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లుగానీ, కీలకమైన టోర్నీలుగాని ఆ మైదానాల్లో నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే, ఆ స్థాయిలో అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోతే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ చూస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ విషయంలోనూ అదే చేస్తోంది ఐసీసీ. యూఎస్ఏ, వెస్టిండీస్ లో జరగాల్సిన టి20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ కు మార్చాలని ఐసిసి నిర్ణయించింది. ఈ రెండు దేశాల్లో మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మౌలిక సదుపాయాలు మార్చడం సులభం కాదన్న ఉద్దేశంతో..

ఐసీసీ నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ కు మరో 12 నెలల సమయం ఉంది. ఈలోగా అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడం అంత ఈజీ కాదు. అందుకే ఈ టోర్నని నిర్వహించాలని ఇంగ్లాండును రిక్వెస్ట్ చేయాలని ఐసిసి భావిస్తోంది. గతంలో ఐసీసీ ప్రకటన ప్రకారం 2030 టి20 వరల్డ్ కప్ ఇక్కడ జరగాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితిని బట్టి టి20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లో నిర్వహించి 2030లో టోర్నీని అమెరికాలో ఏర్పాటు చేయాలని ఐసీసీ ప్లాన్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఐసీసీ ఈవెంట్ నిర్వహించే స్థాయికి యూఎస్ఏలోని స్టేడియాల్లో వసతులు అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. అమెరికాలో వసతులు ఏమంత బాగా లేవని, అందుకే 2024, 2030 వేదికలను స్వాప్ చేయాలని ఐసిసి అనుకుంటుందని ఐసీసీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు.

అమెరికాలో రెండు స్టేడియాల్లో మాత్రమే వసతులు..

ప్రస్తుతం అమెరికాలో కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లు నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో వసతులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రో వార్డ్ రీజినల్ పార్క్ ఒకటి కాగా, టెక్సాస్ లోని మూసా స్టేడియం రెండోది. ఇప్పటి వరకు అసోసియేట్ దేశాలు ఆడిన 12 వన్డేలకు మూసా స్టేడియం వేదికగా నిలిచింది. ఇక సెంట్రల్ బ్రో వార్డు రీజినల్ పార్కులో ఇండియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక తదితర దేశాలు పాల్గొన్న 14 టి20 లకు ఆతిథ్యం ఇచ్చింది. టి20 వరల్డ్ కప్ కోసం మరిన్ని స్టేడియాలను అభివృద్ధి చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఐసిసి ఈ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ఆయా దేశాలు ఏ మేరకు అంగీకరిస్తాయో..? అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular