T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసిసి… ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

అందుకే వాళ్లు కూడా చాలా తెలివిగా ఈ మ్యాచ్ ని హైలెట్ చేస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే గత సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఫైనల్ కు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయింది.

Written By: NARESH, Updated On : January 5, 2024 9:48 pm
Follow us on

T20 World Cup 2024 : ఈ సంవత్సరం జూన్ నెలలో టి 20 వరల్డ్ కప్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే తాజాగా ఐసీసీ టి 20 వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ ని రిలీజ్ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. అయితే 1 వ తేదీన నుంచే లీగ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.

ఇక అందులో భాగంగానే 1 వ తేదీ నుంచి 18వ తేదీ వరకు లీగ్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సూపర్ 8 మ్యాచ్ లను నిర్వహిస్తారు. అలాగే 26, 27 వ తేదీలలో సెమీఫైనల్ మ్యాచ్ లను నిర్వహిస్తారు. జూన్ 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇప్పటికే ప్రపంచం మొత్తం ఎదురుచూసే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడు అనే ప్రశ్న అయితే అందరి మదిలో మెదులుతూ ఉంటుంది. జూన్ 9వ తేదీన న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించడానికి ఐసిసి నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే చాలామంది ఎదురుచూస్తున్నారు.టి 20 వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్ లు జరిగిన కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఇచ్చినంత కిక్కు వేరే ఏ మ్యాచ్ ఇవ్వదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఐసీసీ కూడా ఈ మ్యాచ్ మీద స్పెషల్ ఫోకస్ ని పెడుతుంది. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ లో మొత్తం అన్ని మ్యాచ్ లు ఆడితే ఎంత లాభం వస్తుందో ఈ ఒక్క మ్యాచ్ మీద అంతకంటే ఎక్కువ లాభం వస్తుంది.

అందుకే వాళ్లు కూడా చాలా తెలివిగా ఈ మ్యాచ్ ని హైలెట్ చేస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే గత సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఫైనల్ కు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. కాబట్టి ఈ సంవత్సరంలో జరిగే టి20 వరల్డ్ కప్ అయిన కొట్టి ఇండియన్ టీం తమ సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తుంది. మరి ఈ సారి అయిన ఇండియన్ టీమ్ కప్పు కొడుతుందా లేదా అనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. నిజానికి టి20 వరల్డ్ కప్ మొదటి సీజన్ లోనే ఇండియన్ టీం కప్పు కొట్టింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోవడం గమనార్హం…