T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ సమరం మొదలైంది. క్వాలిఫైయర్ మ్యాచ్ లు ముగిసి నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధించాయి. ప్రపంచంలోని టాప్ 12 జట్ల మధ్య ఇప్పుడు సెమీస్ కోసం ఫైట్ మొదలవుతోంది. గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనలిస్టులు అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యన తొలి మ్యాచ్ సిడ్నీలో జరుగబోతోంది. ఇక రేపు ఆదివారం టోర్నీలోనే బిగ్ ఫైట్ అయిన అసలు సిసలు పోరు జరుగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులంతా ఉవ్విళ్లూరుతున్నారు.

క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ముగియడంతో టాప్ 2లో నిలిచిన నాలుగు జట్లు అర్హత సాధించాయి. గ్రూప్ ఏ నుంచి శ్రీలంక నెదర్లాండ్స్, గ్రూప్ బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ లు అర్హత సాధించాయి. జిబాంబ్వే, నెదర్లాండ్స్ టీంలు భారత్ ఉన్న గ్రూపులో చోటు సంపాదించాయి. శ్రీలంక, ఐర్లాండ్ లు ఆస్ట్రేలియా ఉన్న గ్రూపులో ఉన్నాయి.
-ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో గెలుపెవరిది?
తొలి మ్యాచ్ లో టీ20 వరల్డ్ కప్ చాంపియన్ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఎదుర్కొంటోంది. ఇటీవల వీరి మధ్యన జరిగిన మ్యాచులలోనూ ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఈ తొలి మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఆల్ రౌండర్లతో ఆస్ట్రేలియా భీకరంగా కనిపిస్తోంది. మ్యాక్స్ వెల్, కమిన్స్, స్టార్క్, మార్ష్, కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్ తో భీకరమైన లైనప్ ను ఆస్ట్రేలియా కలిగి ఉంది. ఇక న్యూజిలాండ్ గాయాలతో సతమతమవుతోంది. అంతా సీనియర్లు అయిన కెప్టెన్ విలియమ్స్ సన్, గప్టిల్, ఆల్ రౌండర్లు జిమ్మీ నీషమ్, సాట్నర్, ఫెర్గ్యూసన్ లపై ఆధారపడుతోంది. ఓవరాల్ గా చూస్తే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
-రేపు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉత్కంఠభరితం
దాయాదుల పోరుకు రేపు రంగం సిద్ధమైంది. టీమిండియా నెట్స్ లో శ్రమిస్తోంది.ఈసారి పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షాహీన్ ఆఫ్రిదిని కాచుకోవడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ సేనావిరత్నే బౌలింగ్ లో రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. మెరుపు వేగంతో షాహీన్ సంధించే బతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఇక షాహీన్ బంతులను స్వింగ్ అయ్యే ఆ బంతులను డైరెక్ట్ గా కాకుండా ‘వీ’ ఆకారంలో ఆడేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ పై భారీ స్కోరు సాధించేందుకు.. ఓడిపోకుండా రోహిత్ శ్రమిస్తున్నాడు.

ఇక టీమిండియాకు ప్రపంచకప్ లో ఓటమి లేని చరిత్రను పాకిస్తాన్ చెరిపేసింది. గత టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను పాక్ ఓడించింది. ఆసియాకప్ లోనూ మరోసారి ఓడించింది. అందుకే ఈసారి ఖచ్చితంగా పాక్ ను ఓడించాలని భారత్ పట్టుదలతో ఉంది.
బలబలాల పరంగా చూస్తే.. పాకిస్తాన్ బలమైన బౌలింగ్ దళానికి.. భారత భీకర బ్యాటింగ్ కు ఇది పరీక్షగా మారుతోంది. పోయిన సారి షాహిన్ ధాటికి భారత టాప్ ఆర్డర్ కుదేలై ఓడిపోయింది. అందుకే ఈ సారి అతడిని ఎదుర్కోవడానికి బాగా కసరత్తు చేస్తోంది. ఇక టీంలో నలుగురు బౌలర్లను తీసుకోవాలా? లేక ఐదో బౌలర్ ను ఆడించాలా? అన్నది టీమిండియా కసరత్తు చేస్తోంది.
ఓవరాల్ గా టీమిండియా,పాకిస్తాన్ లు భీకరంగా ఉన్నాయి. ఇందులో ఎవరిది గెలుపు అన్నది చెప్పడం కష్టం. ఆరోజు ఎవరు ఆడితే వారిదే విజయం అని చెప్పొచ్చు.
-టీమిండియా వరల్డ్ కప్ షెడ్యూల్
అక్టోబర్ 23న : ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మధ్యాహ్నం 1.30 గంటలకు
అక్టోబర్ 27న : ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్యాహ్నం 12.30 గంటలకు
అక్టోబర్ 30న : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా.. సాయంత్రం 4.30 గంటలకు
నవంబర్ 2: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ : మధ్యాహ్నం 1.30 గంటలకు
నవంబర్ 6: ఇండియా వర్సెస్ జింబాబ్వే: మధ్యాహ్నం 1.30 గంటలకు