సాధారణంగా బిర్యానీ అంటే మనలో చాలామంది ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే ఈ బిర్యానీ వ్యాపారం ద్వారా ఒక మహిళ ఏకంగా 200 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆ బిర్యానీ రుచి వల్లే ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తలపాకట్టు బిర్యానీ తమిళనాడు రాష్ట్రంలో చాలా ఫేమస్. తమిళనాడులోని దిండిగల్ కు చెందిన నాగసామి భార్య బిర్యానీని బంధువులు, స్నేహితులు మెచ్చుకోవడంతో అతను ఆనంద్ విలాస్ పేరుతో హోటల్ ను ప్రారంభించాడు.
Also Read: ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
నాగసామి ఆ బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్ కావడంతో పాటు తలపాగా చుట్టుకునే అలవాటు ఉన్న అతను ఆ బిర్యానీకి తలపాకట్టు బిర్యానీ అని పేరు పెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దీపిక అప్పటికే బాగా జరుగుతున్న వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆధునిక మార్కెటింగ్ పద్ధతుల ద్వారా బెంగళూరు, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకంగా 79 బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు.
Also Read: ఆ రాష్ట్ర రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాల్లోకి రూ.18 వేలు..!
ఎవరికీ ఫ్రాంఛైజీ ఇవ్వకుండా ప్రతి శాఖకు సంబంధించిన బాధ్యతలను ఆమెనే నిర్వహించారు. ప్రస్తుతం 300 రకాలకు పైగా రుచికరమైన ప్రత్యేకమైన వంటకాలను జత చేసి మహిళ వ్యాపారం చేస్తున్నారు. అదే సమయంలో ప్రతి శాఖలో మిగిలిన ఆహారాన్ని నిరుపేదలకు ఉచితంగా పంచుతున్నారు. ఈ శాఖ బ్రాంచ్ ల ద్వారా రెండున్నర వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలుస్తోంది. ఈ బిర్యానీ కోసం సీరగ సంబా బియ్యంను వినియోగిస్తారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
నాణ్యత ఉన్న మసాలా పొడి, మాంసంను బిర్యానీ తయారీ కోసం వినియోగిస్తారు. వంటవాళ్లకు శిక్షణనిచ్చి అందరికీ ఒకే రకం బిర్యానీ రుచిని అందిస్తున్నారు. తలపాకట్టు బిర్యానీ దేశవిదేశాల్లో సైతం ప్రశంసలను అందుకుంటూ ఉండటం గమనార్హం.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More