Heroes Remuneration : : ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అందువల్లే ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసిన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే అనేంత స్థాయికి మన సినిమా ఎదగడం అనేది నిజంగా గర్వకారణమనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు ఇండియాలో రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకునే స్టార్ హీరోలు ఎవరు అంటే అందరూ బాలీవుడ్ హీరోల గురించి చెప్పేవారు.
ముఖ్యంగా ఖాన్ త్రయం దేశంలో టాప్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి ఎదగడం తో మన తెలుగు హీరోల రెమ్యూనరేషన్స్ కూడా భారీ స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా మన హీరోలు ఎంత డిమాండ్ చేస్తే అన్ని డబ్బులు ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు వెనకాడడం లేదు అంటే, మన హీరోల మార్కెట్ అనేది ఏ రేంజ్ లో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు ఇండియాలో అత్యధికమైన రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక హీరో ప్రభాస్…ఈయన ఒక్క సినిమా కోసం ఏకంగా 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరో మరొకరు లేకపోవడంతో ప్రస్తుతానికి ప్రభాస్ టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత కూడా వరుస సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నప్పటికీ కొన్ని సక్సెస్ అవుతుంటే మరికొన్ని డిజాస్టర్లు అవుతున్నాయి. అయినప్పటికీ తన క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక రీసెంట్ గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక అందులో భాగంగానే ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం కల్కి, రాజాసాబ్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలతో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…