Rahul Gandhi : రాహుల్ గాంధీ మెల్లిమెల్లిగా కాంగ్రెస్ ను మరో కమ్యూనిస్టు పార్టీగా రూపాంతరం చెందిస్తున్నాడా? అంటే ఔననే అనిపిస్తోంది. తొలినాళ్లలో కమ్యూనిస్టులు టాటా, బిర్లాలను విమర్శించేశారు. ఇవాళ మోడీని విమర్శించడానికి అంబానీ, అదానీలనే పావుగా వాడుకుంటున్నారు.
2024 ఎన్నికలకు ముందు కూడా అదానీ-మోడీని టార్గెట్ చేసి రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. అదానీ కాంగ్రెస్ హయాంలోనూ అభివృద్ధి చెందాడు. బీజేపీ హయాంలోనూ ఎదిగాడు. బిజినెస్ మెన్ లు అధికారంలో ఉన్న వారిని పట్టుకొని ఎదుగుతుంటారు. కాంగ్రెస్ ఈ పనిచేయకుండా ఉంటే నైతికత ఉంటుంది.
2021లో రాజస్థాన్ లో 10వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెట్టడానికి అదానీతో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ ఒప్పందం చేసుకున్నాడు. చత్తీస్ ఘడ్ సీఎం కూడా అదానీకి పలు ప్రాజెక్ట్ లు ఇచ్చాడు. ముందు ఈ అదానీకి ఇలాంటివి చేయకుండా కాంగ్రెస్ నేతలు ముందు తీర్మానం చేయాలి. అప్పుడే రాహుల్ మాటలకు నైతికత ఉంటుంది. 2011లో ఇదే యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం అదానీకి ‘సూపర్ బ్రాండ్ ఆఫ్ ఇండియా’ అంటూ అవార్డ్ ఇచ్చారు. మరి దీన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటాడన్నది ప్రశ్న.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ అంబానీ-అదానీ జపంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.