Homeఆంధ్రప్రదేశ్‌Somu Veeraju ABN RK: చంద్రబాబును సీఎం చేయడానికా మీ ప్లాన్.. ఏబీఎన్ ఆర్కేకు లైవ్...

Somu Veeraju ABN RK: చంద్రబాబును సీఎం చేయడానికా మీ ప్లాన్.. ఏబీఎన్ ఆర్కేకు లైవ్ లో షాకిచ్చిన సోము వీర్రాజు

Somu Veeraju vs ABN RK: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రత్యర్థులను ఇరుకునపెడుతూ.. తన ఆరాధ్యుడు చంద్రబాబు గురించి ఎప్పుడూ తపన పడుతుంటాడు. ప్రతిసారి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని ఉబలాటపడుతుంటాడు. ఆర్కే వేసే ప్రశ్నలకు షర్మిల నుంచి కేసీఆర్, మోహన్ బాబు లాంటి దిగ్గజాల వరకూ ఇరుకునపడ్డ వారే. ఎవ్వరు వచ్చిన తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి వాళ్లు నోరు జారేలా చేయగల సమర్థుడు ఏబీఎన్ ఆర్కే. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఏబీఎన్ ఆర్కే వలలో చిక్కలేదు. పైగా ఆర్కేకు గట్టి కౌంటర్ ఇచ్చి ఆయన నోరు మూయించడం విశేషం.

 

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తాజాగా సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే జగన్ పాలన వైఫల్యాలపై బీజేపీ ఎందుకు పోరాడడం లేదని రాధాకృష్ణ సూటిగా సోము వీర్రాజును ప్రశ్నించారు. ‘ఈ మూడేళ్లలో చంద్రబాబు వేయలేని రోడ్లు జగన్ వేయాలి కదా? అది మీరు అడగాలి కదా?’ అంటూ చంద్రబాబు తరుఫున వకాల్తా పుచ్చుకొని మరీ నిలదీశారు.

చంద్రబాబు పై గన్ పెట్టి జగన్ ను సోము వీర్రాజు చేత కాల్చాలని ఆర్కే చేసిన ఫైరింగ్ గురితప్పింది. దాన్ని సోము వీర్రాజు ఆయనకే సూటి పెట్టారు. సోము వీర్రాజు పంచ్ కు ఏబీఎన్ ఆర్కేకు షాక్ తగిలిన పని అయ్యింది. ‘జగన్ మీద వ్యతిరేకత పెంచి చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనా మీ భావన.. ’ అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ‘అయితే జగన్ ను తక్కువ తిట్టాం.. చంద్రబాబును ఎక్కువ తిట్టామన్నది లేదు. లిక్కర్ పై జగన్ ను తొలుత వ్యతిరేకించింది తానేనని’ సోము వీర్రాజు గట్టి కౌంటర్లు సంధించారు. జగన్ లిక్కర్ బ్రాండ్ల నుంచి ఆవ భూముల వరకూ మొదట మాట్లాడింది నేనే కదా అంటూ తాజా ఇంటర్వ్యూలో ఏబీఎన్ ఆర్కేపైనే వీర్రాజు విరుచుకుపడడం వైరల్ గా మారింది.

మూడు రోజుల్లో తనను అధ్యక్ష పదవి నుంచి తీసేస్తారని మీ పత్రికల్లో రాశారు. కానీ 8 నెలలైంది.. ఇక నేనొచ్చిన తర్వాత బీజేపీ పాడైపోయిందా? 2019 ఎన్నికల్లో బీజేపీకి 0.89 శాతం ఓట్లు వస్తే.. మొన్నటి తిరుపతి ఎన్నికల్లో 5.6 శాతం ఓట్లు, బద్వేలులో 14 శాతం వచ్చాయి. ఈ లెక్కన నేను ఏం నాశనం చేశానో చెప్పాలంటూ ఏబీఎన్ ఆర్కే ప్రశ్నకు దిమ్మదిరిగే జవాబిచ్చి సోము వీర్రాజు గట్టి షాక్ లే ఇచ్చారు.

ఇక తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉందని.. ఏపీలో ఎందుకు లేదని సోము వీర్రాజును ఈ కోణంలోనూ ఆర్కే ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. దానికి సోము వీర్రాజు గట్టి కౌంటర్లే ఇచ్చారు. ‘తెలంగాణ కంటే మేం చాలా దూకుడుగా ఉన్నామని.. కానీ ఏపీలో ఉన్న మనుషుల సైకాలజీకి మన భావన అందడం లేద’ని ఆర్కే మైండ్ సెట్ పై సోము వీర్రాజు వేసిన పంచ్ కు ఆర్కే నోట మాట రాలేదంటే నమ్మండి. ఏపీలో బీజేపీపై కొందరు కలిసి కుట్ర చేస్తున్నారని.. ఈ దాడికి కౌంటర్ ఎటాక్ చేస్తున్నామని.. జగన్ వలంటీర్ వ్యవస్థ మాదిరిగా బీజేపీలో ‘పేజ్ ప్రముఖ వ్యవస్థను’ బలోపేతం చేస్తామంటూ టీడీపీ, ప్రతిపక్షాలు… మీడియా ద్వారా బీజేపీపై చేస్తున్న కుట్రను సోము వీర్రాజు బయటపెట్టారు.

Also Read: Telangana Intermediate Board: ఇంటర్‌ ఫలితాల పెంపు కోసం.. ప్రీ ఫైనల్‌ ప్రయోగం ఫలించేనా?

ఇక అమరావతి రాజధానిని లేవనెత్తి ఏపికి రాజధాని లేదన్న కసి మీకుందా? అని సోము వీర్రాజును రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఆర్కే. దీనికి అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు సోము వీర్రాజు.. ‘మీరు ఏపీకి దూరంగా హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి.. రాష్ట్ర రాజధాని విషయంలో మాకున్న కసి మీకు కనిపించడం లేదు.’ అంటూ ఏబీఎన్ ఆర్కే చెంప చెళ్లుమనేలా సోము వీర్రాజు కౌంటర్ ఇవ్వడం విశేషం. చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులతో అభివృద్ధి చేశారని..కానీ జగన్ మాత్రం కేంద్రం డబ్బుతో తన సొంత పథకాలకు మళ్లించుకొని వాడేస్తున్నారంటూ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.

ఇక ఏపీలో అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆర్కే నిలదీశారు. బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్యాకేజీ ఇస్తానని ప్రధాని మోడీ అన్నా తొలుత నాటి సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ఇప్పుడు జగన్ వినకుండా హోదా కోసం పట్టుబట్టారని.. అటు ఆ నిధులు రాకుండా.. ఇటు హోదా రాకుండా ఏపీ మునిగిందని అసలు వాస్తవాన్ని సోము వీర్రాజు బయటపెట్టారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంది. కానీ జగన్ కు చేతకావడం లేదు. ఇదే విషయాన్ని తాను ప్రెస్ మీట్ పెట్టి చెబితే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ లో కనీసం ఒక్క వార్త కూడా రాయలేదని సోము వీర్రాజు ఆరోపించారు. ‘ఆంధ్రజ్యోతిలో అసలు కొన్ని సార్లు నా పేరే తీసేస్తున్నారని.. కొంచెం మాకూ స్పేస్ ఇవ్వండి’ అంటూ ఆర్కే వైఖరిని ఇంటర్వ్యూలోనే కడిగిపారేశారు సోము వీర్రాజు.

వ్యతిరేక వార్తలు రాస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బాయ్ కాట్ చేశారని.. అలా ఏకపక్షంగా ప్రకటన చేయడం న్యాయమా? అని సోము వీర్రాజును ప్రశ్నించాడు ఆర్కే.. దీనికి సోము వీర్రాజు అదిరిపోయే జవాబిచ్చాడు. ‘మీకు తిక్క ఉంది. దానికో లెక్క ఉందిలెండి.. అవును మేమే ఆంధ్రజ్యోతి మీడియాను బాయ్ కాట్ చేశాం. విష్ణువర్ధన్ రెడ్డి విషయంలో లైవ్ లో మీ చానెల్ వ్యవహరించిన తీరుకే మేం నిషేధించామని.. మీకు, నాకు ఆష్తుల గొడవలు లేవు కదా? మీదో రాష్ట్రం, నాదో రాష్ట్రం..’ అంటూ ఏబీఎన్ ఆర్కే చానెల్ కుట్రపూరితంగానే చేసిందని పరోక్షంగా చురకలంటించారు.

Also Read: Netizens Fire on Mohan Babu: నెటిజన్ల ఫైర్.. మోహన్‌బాబు ప్రచారం చేయడం వల్లే బీజేపీకి ఓట్లు పడ్డాయా?

ఇలా అందరినీ తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కౌంటర్ లకు ఏకంగా సోము వీర్రాజు ఎన్ కౌంటర్ చేసేశాడు. ఆంధ్రజ్యోతి ఏపీలోని బీజేపీపై చేస్తున్న కుట్రలను కూడా ఇందులో ప్రస్తావించి షాక్ ఇచ్చారు. ప్రతి ప్రశ్నకు లోతుగా.. విశ్లేషణాత్మకంగా.. అదే సమయంలో కౌంటర్ గా సోము వీర్రాజు చెప్పిన సమాధానాలు అద్భుతంగా పేలాయి. ఆర్కే అందరినీ ముప్పుతిప్పలు పెడితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం సోము వీర్రాజు ధాటికి ఆర్కే అల్లాడిపోయారు. ప్రశ్న అడగడమే ఆలస్యం విరుచుకుపడుతున్న సోము వీర్రాజు ధాటికి రాధాకృష్ణ బెంబేలెత్తిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular