సాధారణంగా ఆకాశంలో మనకు ఒక సూర్యుడు మాత్రమే దర్శనమిస్తాడు. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం ప్రజలకు ఒక సూర్యుడు మాత్రమే కనిపిస్తాడు. అయితే చైనా దేశంలో మాత్రం ఒకటి రెండు కాదు ముడు సూర్యులు ప్రత్యక్షమయ్యారు. చైనా లోని మోహే నగరంలో మూడు సూర్యులు ఒకే చోట దర్శనమివ్వడం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. చైనాలోని మోహే పట్టణంలో చోటు చేసుకునన్ ఈ అరుదైన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మూడు సూర్యులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మూడు సూర్యుల ఫోటోలను, వీడియోలను చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ఈరోజు ఉదయం 6 : 30 నుంచి 9 : 30 వరకు మూడు సూర్యులు ఆ ప్రాంతంలో దర్శనమిచ్చారు. సూర్యుడికి ఎడమ, కుడి వైపుల్లో ఫాంటమ్ సన్స్ అనే పేరుతో పిలవబడే రెండు ప్రకాశవంతమైన మచ్చలు ఉన్నాయి. ఇలాంటి దృశ్యాన్ని సన్ డాగ్స్ అని పిలుస్తారని సమాచారం.
అయితే ఇలా మూడు సూర్యులు దర్శనం ఇవ్వడానికి శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన కారణాలను వెల్లడిస్తున్నారు. సూర్యరశ్మి ఎక్కువ ఎత్తులో ఉన్న స్ఫటికాల గుండా వెళుతున్న సమయంలో ఆప్టికల్ భ్రమ కలుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నా రు. శాస్త్రవేత్తలు సన్ డాగ్స్ ఏ సీజన్లోనైనా ఎప్పుడైనా చూడవచ్చని అయితే అవి స్పష్టంగా మాత్రం కనబడవని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇలా ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో సూర్యులు దర్శనమివ్వడం ఇదే తొలిసారి కాదు. ఐదు సంవత్సరాల క్రితం రష్యాలోని చెలియాబిన్స్క్ అనే ప్రాంతంలో సైతం మూడు సూర్యులు కనిపించాయి. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో గతంలో ఐదు సూర్యులు దర్శననిచ్చాయి.