https://oktelugu.com/

హైదరాబాద్ లో మళ్లీ వర్షం.. భిక్కుభిక్కుమంటున్న జనం

కరోనా రాకతో పల్లె, పట్నాన్ని ప్రకృతి పరిశుద్ధం చేసింది. అందుకే టైం ప్రకారం వానలు కొడుతున్నాయి. మామూలుగా కాదు దంచి కొడుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రకృతి పునీతం కావడంతో ఇప్పుడు పులకించిపోయి జనాలపై జల్లులు కురిపిస్తున్నాయి. దీంతో నాలాలు, చెరువులను కబ్జా చేసి మరీ ఇల్లు కట్టుకున్న హైదరాబాద్  జనాలు నిండా మునుగుతున్నారు. Also Read: హైదరాబాదీలు.. తస్మాత్‌ జాగ్రత్త ప్రకృతితో గేమ్స్ ఆడితే ఎంత ప్రళయ భీకరంగా ఉంటుందో హైదరాబాద్ లో వరదలను కళ్లారా చూశాక […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 / 07:07 PM IST
    Follow us on

    కరోనా రాకతో పల్లె, పట్నాన్ని ప్రకృతి పరిశుద్ధం చేసింది. అందుకే టైం ప్రకారం వానలు కొడుతున్నాయి. మామూలుగా కాదు దంచి కొడుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రకృతి పునీతం కావడంతో ఇప్పుడు పులకించిపోయి జనాలపై జల్లులు కురిపిస్తున్నాయి. దీంతో నాలాలు, చెరువులను కబ్జా చేసి మరీ ఇల్లు కట్టుకున్న హైదరాబాద్  జనాలు నిండా మునుగుతున్నారు.

    Also Read: హైదరాబాదీలు.. తస్మాత్‌ జాగ్రత్త

    ప్రకృతితో గేమ్స్ ఆడితే ఎంత ప్రళయ భీకరంగా ఉంటుందో హైదరాబాద్ లో వరదలను కళ్లారా చూశాక తెలిసింది. ఏకంగా 100 ఏళ్లలో కొట్టని వర్షం పడి 32 సెం.మీల ధాటిగా పడడంతో హైదరాబాద్ మునిగింది. మన పాలకులు, ప్రజల వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపింది. హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందో కళ్లారా చూశాం. అది జరిగి రెండు రోజులు కాకముందే మరో ముప్పు ముంచుకొస్తోంది.

    హైదరాబాద్ నగరాన్ని మరోసారి చిమ్మి చీకట్లు కమ్ముకున్నాయి. నగరంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉన్నట్టుండి హఠాత్తుగా భారీ వర్షం కురుస్తోంది. చిరు జల్లులతో ప్రారంభమైన వాన.. రోడ్లు జలమయం అయ్యేలా భారీ వర్షం కురిసింది.

    దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, ఎల్బీనగర్, మీర్ పేట, హయత్ నగర్ లో భారీ వర్షం కురిసింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఆఫీసులు ముగిసి ఇంటికొచ్చే ఉద్యోగులంతా వర్షంలో భారీ ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయారు. ఇప్పటికే మొన్న కురిసిన వరద కష్టాల నుంచి కోలుకోకముందే మరోసారి భారీ వర్షం కురవడంతో వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు పూర్తికాకముందే మళ్లీ వర్షం పడుతుండడంతో జనాలు, అధికారులు భిక్కుభిక్కుమంటున్నారు.

    Also Read: బ్రేకింగ్: కంగనా రనౌత్ పై దేశద్రోహం కేసు

    కాగా ఈ వర్షాలకు తీవ్ర అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ ప్రజల్లో మరోసారి ఆందోళన నెలకొంది.