పట్టణాలు, మండలాల్లో బిర్యానీ ధర తక్కువగానే ఉన్నా నగరాల్లో మాత్రం ధర ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరంలో బిర్యానీ కొనుగోలు చేయాలంటే 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే బిర్యానీ తక్కువ ధరకే నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. “తిన్నంత బిర్యానీ” పేరుతో రుచికరమైన బిర్యానీ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది.
ఉప్పల్ చౌరస్తా నుంచి రామంతాపూర్‌కు వెళ్లే మార్గంలో ఈ బిర్యానీ లభిస్తోంది. వీకెండ్ లో తక్కువ ధరకే బిర్యానీ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ బిర్యానీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అన్నాదమ్ములైన ఉదయ్, కిరణ్ తిన్నంత బిర్యానీ పేరుతో స్టార్టప్ ను ప్రారంభించారు. బిర్యానీని కొనుగోలు చేసిన వాళ్లకు బిర్యానీతో పాటు అదనంగా పెరుగు, స్వీట్, మినరల్ వాటర్, గ్రేవీ, సలాడ్ అందిస్తున్నారు.
కడుపు నిండా తినేంత బిర్యానీ తినవచ్చని అయితే వెజ్ బిర్యానీ మాత్రమే తాము విక్రయిస్తామని బిర్యానీ నిర్వాహకులు పేర్కొన్నారు. రోజురోజుకు తిన్నంత బిర్యానీ సెంటర్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని నిర్వాహకులు వెల్లడించారు. బిర్యానీ తయారీ కోసం బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నామని వెల్లడించారు. రోజుకు 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు బిర్యానీపై ఇన్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు.
ఇక్కడి స్థానికులు సైతం ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌లో బిర్యానీ రుచిగా ఉందని.. తక్కువ ధరకే క్వాలిటీ బిర్యానీ ఈ బిర్యానీ పాయింట్ లో లభిస్తోందని చెబుతున్నారు. ఎంతో రద్దీగా ఉండే ఏరియాలో బిర్యానీ నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ ను అందిస్తూ ఉండటం గమనార్హం.