https://oktelugu.com/

మాజీ బ్యూటీ నుండి బోల్డ్ వెబ్ సిరీస్ !

నిర్మాత అయ్యాక ‘ఛార్మి’ పూర్తిగా నటనకు దూరమైపోయింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా వయసు ఉండగానే అవుట్ డేటెడ్ అయిపోయింది. ప్రస్తుతం పూరి సాన్నిహిత్యంలో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోన్న ఛార్మి, త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. పూరి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తోన్న రవి అనే కొత్త డైరెక్టర్ కోసం ఛార్మి నటిస్తోందట. అతన్ని డైరెక్టర్ ని చేయాలనే ఇంట్రస్ట్ తోనే ఆ వెబ్ సిరీస్ […]

Written By:
  • admin
  • , Updated On : February 28, 2021 / 04:41 PM IST
    Follow us on


    నిర్మాత అయ్యాక ‘ఛార్మి’ పూర్తిగా నటనకు దూరమైపోయింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా వయసు ఉండగానే అవుట్ డేటెడ్ అయిపోయింది. ప్రస్తుతం పూరి సాన్నిహిత్యంలో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోన్న ఛార్మి, త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. పూరి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తోన్న రవి అనే కొత్త డైరెక్టర్ కోసం ఛార్మి నటిస్తోందట. అతన్ని డైరెక్టర్ ని చేయాలనే ఇంట్రస్ట్ తోనే ఆ వెబ్ సిరీస్ ను తానే ప్రొడ్యూస్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: రాజ‌మౌళి సినిమాకు ముందు మ‌రో ద‌ర్శ‌డితో మ‌హేష్.. ఎవరది?

    ఎంతైనా ఛార్మి ఒకప్పుడు తన గ్లామర్ తో హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. పైగా హద్దులు దాటిన ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయి మరీ నటించింది. ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ చేయబోయే క్యారెక్టర్ కూడా వెరీ బోల్డ్ గా ఉంటుందట. వేశ్య వృత్తికి ఎడిట్ అయిన మహిళగా ఈమె ఈ సినిమాలో నటించబోతుంది. మొత్తం మీద ‘నీతోడు కావాలి’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైన ఈ మాజీ బ్యూటీ మళ్ళీ గ్లామర్ చూపించడానికి రెడీ అవుతుంది అన్నమాట. నిజానికి బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరే బాప్.. అంటూ ఛార్మి హిందీలో కూడా ఒక వెలుగు వెలగటానికి ప్రయత్నించి దారుణంగా విఫలం అయింది.

    Also Read: మహేష్ మరీ ఇంత స్లో అయితే ఎలా ?

    అప్పటినుండే ఆమెకు నటన పై ఇంట్రస్ట్ పోయిందని.. దాంతోనే పూరి జగన్నాధ్ తో ‘జ్యోతిలక్ష్మి’ అంటూ టాలీవుడ్ లో నిర్మాతగా మారింది. చివరకు పూరితోనే సినిమాలు నిర్మిస్తూ అలా తన జర్నీని లాక్కొస్తోంది. ఇప్పుడు మళ్ళీ నటన పై ఆసక్తి చూపిస్తోంది. పైగా ఛార్మి అభిమానులు కూడా ఎప్పటినుండో మళ్ళీ మా కోసం ఓ సినిమా చేయండి అని అడుగుతున్నారట. అందుకే తన అభిమానుల కోసమైన ఒక్క సినిమా గాని, ఒక వెబ్ సిరీస్ గాని చేస్తే బావుంటుందని ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ చేయబోతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్