Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా హీరో మాత్రమే కాదు, ఇంటర్ నేషనల్ హీరో కూడా. అందుకే, ప్రభాస్ పేరు చెబితే.. ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు. అభిమానంతో అభిమానులు నీరాజనాలు పలుకుతారు. అసలు ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ జనాలు కూడా ప్రభాస్ అంటే పడి చస్తున్నారు. జనరల్ గా ఇలాంటి హీరోతో పని చేయాలని ఏ హీరోయిన్ అయినా కలలు కంటుంది. పైగా ప్రభాస్ పక్కా జెంటిల్ మ్యాన్. సరదాగా ఉంటూ సెట్లో అందరితో కలిసి పోతాడు. నేను గొప్ప స్టార్ హీరోని అనే ఫీలింగ్ ప్రభాస్ లో కనిపించదు.

అసలు ఇలాంటి హీరోతో ఒక హీరోయిన్ ఎందుకు గొడవ పడింది ?. పైగా ఆ హీరోయిన్, ప్రభాస్ గురించి బ్యాడ్ గా కూడా కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరు ?, మరెవరో కాదు.. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ప్రభాస్ – పూజా హెగ్డే ‘రాధేశ్యామ్’ సిమానిలో కలిసి నటించారు. అయితే,ఆ సినిమా రిలీజ్ సమయంలో ముంబైలో జరిగిన ‘రాధేశ్యామ్’ ప్రమోషన్ ఈవెంట్ లో ప్రభాస్ – పూజ హెగ్డే అస్సలు మాట్లాడుకోలేదు. పైగా ఇద్దరు దూరదూరంగా నుంచున్నారు. ఎందుకు ? అని అప్పుడు ఫ్యాన్స్ మధ్య కూడా పెద్ద చర్చే జరిగింది.
పక్క పక్కనే ఉన్నా హీరోహీరోయిన్ల మధ్య బాండింగ్, కెమిస్ట్రీ ఎలా మిస్ అయింది ? అంటూ వివిధ కథనాలను అనేక కోణాల్లో రాశారు. ‘రాధేశ్యామ్ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ – పూజ హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్ కూడా నడిచింది. ప్రభాస్ – పూజ హెగ్డేల మధ్య మాటలు లేవని పుకార్లు పుట్టించారు. అంతేకాదు, రాధే శ్యామ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరు ఎడముఖం పెడమఖంగా ఉంటూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు అంటూ వచ్చిన వార్తలు నిజమే అని అనుకున్నారు జనాలు.

మరి నిజంగానే రాధే శ్యామ్ షూటింగ్ టైంలో వీరిద్దరికీ అస్సలు పడలేదా ?, అసలు వీరి మధ్య ఏం జరిగిందో చూద్దాం. ‘రాధేశ్యామ్ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్న టైంలో ప్రభాస్ ను పూజా హెగ్డే బాగా టార్చర్ చేసిందట. పైగా పూజా సెట్స్ లో హెడ్ వెయిట్ కూడా చూపించడం ప్రభాస్ ను బాగా ఇబ్బంది పెట్టిందట. షార్ట్ రెడీ అయి ప్రభాస్ వెయిట్ చేస్తున్నా.. పూజా మాత్రం టైంకి వచ్చేది కాదు. మేకప్ అంటూ ప్రతిసారి ప్రభాస్ ను పది నిముషాల పాటు వెయిట్ చేయించేది. ఇలాంటి పనులతోనే పూజా.. ప్రభాస్ ను బాగా టార్చర్ చేసింది.
అందుకే, ప్రభాస్ ఇక తన కెరీర్ లో మళ్లీ ఎప్పుడూ పూజాతో కలిసి నటించను అని తేల్చి చెప్పాడు. నిజానికి, ప్రభాస్ సినీ కెరీర్ లోనే ప్రభాస్ ను టార్చర్ చేసిన ఏకైక హీరోయిన్ పూజా హెగ్డేనే కావడం విశేషం. సహజంగా హీరోయిన్లు అందరూ ప్రభాస్ గొప్ప మనసున్న మనిషి అంటూ ప్రభాస్ ను పొగుడుతూ ఉంటారు. కానీ, పూజా మాత్రం మనసు లేకుండా ప్రవర్తించింది.


[…] Also Read: Prabhas: సినీ హిస్టరీలోనే ప్రభాస్ ను టార్చ… […]
[…] Also Read:Prabhas: సినీ హిస్టరీలోనే ప్రభాస్ ను టార్చ… […]