Somy Ali: బాలీవుడ్ నటిగా కంటే ‘సోమీ అలీ’, సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలుగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పాకిస్తాన్ మోడల్. ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన ఈ మాజీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ ను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద పోస్ట్ పెట్టి.. సల్మాన్ తో పాటు అతని ఫ్యాన్స్ కి సైతం షాక్ ఇచ్చింది. సల్మాన్ ను ‘బాలీవుడ్ హార్వే వైన్‌స్టీన్’ అని సంభోదించింది. ‘బాలీవుడ్ హార్వే వైన్‌స్టీన్, నీ భాగోతం త్వరలోనే బయటకు పడుతుంది. నీ చేతిలో మోసపోయిన అమ్మాయిలందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తారు. నీ బూతు బండారం బయటపెట్టే రోజులు రాబోతున్నాయి’ అంటూ షాకింగ్ మెసేజ్ ను పోస్ట్ చేసింది.

పైగా ‘సోమీ అలీ’ ఐశ్వర్యరాయ్ కు కూడా ధన్యవాదాలు చెప్పింది. ఎందుకో తెలుసా ?, అప్పట్లో సల్మాన్ పై నిజాలను చెప్పేందుకు ఆమె ముందుకు వచ్చింది. అందుకే.. ఇప్పుడు ‘సోమీ అలీ’ ఇలా ఐశ్వర్యరాయ్ కు ధన్యవాదాలు చెప్పుకుంది. ప్రస్తుతం ‘సోమీ అలీ’ పోస్ట్ బాగా వైరల్‌గా మారింది. మరి ‘సోమీ అలీ’ వ్యాఖ్యల పై బాలీవుడ్ కండల వీరుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
‘సోమీ అలీ’ ఇంకా కామెంట్స్ చేస్తూ “దయచేసి అతన్ని అందరూ ఆరాధించడం ఆపండి. అతను ఒక శాడిస్ట్ సిక్ *#uk. మీకు తెలియదు,” ఆమె పోస్ట్ పెట్టింది. మొత్తానికి సల్మాన్ పై ‘సోమీ అలీ’ పగ పట్టింది. ఏది ఏమైనా సోమి అలీ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. నిజానికి 1991లో స్టార్ అవ్వాలనే ఆశతో సోమీ అలీ పరిశ్రమలో అడుగు పెట్టింది.

సోమీ అలీ 1998 వరకు సినిమాల్లో నటించారు. తర్వాత కొంతకాలానికే తెరపై కనుమరుగయ్యారు. ఇండస్ట్రీలో ఉన్నది కొంతకాలమే అయిన బాలీవుడ్ తనకు ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇచ్చిందని సోమీ అలీ చాలాసార్లు పబ్లిక్ గానే బోల్డ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ’20 ఏళ్ల క్రితం నాకు అవకాశాల ఇస్తామని చెప్పి కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్‌లు నాతో శృంగారం చేయాలని తాపత్రయ పడ్డారు. వాళ్ళ తాపత్రయం చల్లారింది గానీ, నాకు మాత్రం అవకాశాలు రాలేదు.
అదే సమయంలో నేను ఓ భయంకరమైన హీరోతో రిలేషన్ షిప్‌లో ఉన్నాను. అతను నీచుడు. అమ్మాయిల రక్తం తాగుతాడు. అది నా జీవితంలోనే దుర్భరమైనదిగా అనిపిసోంది’ అని సోమి, సల్మాన్‌తో ప్రేమ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది.
Also Read:Bigg Boss Season 6- Mohana Bhogaraju: బిగ్‌బాస్‌లోకి బుల్లెట్ బండి సింగర్.. తలుపు తట్టిన అదృష్టం!


[…] Also Read: Somy Ali: ఆ స్టార్ హీరో నీచుడు, అమ్మాయిల రక్… […]