Jawan Teaser Review: పరాజయాలతో డీలా పడ్డ షారుక్ ఖాన్ కమ్ బ్యాక్ తర్వాత సంచలనాలు చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ రిలీజ్ పఠాన్ వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. షారుక్ కెరీర్ లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షారుక్ కి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ విజయ పరంపరను షారుక్ ఖాన్ జవాన్ మూవీతో కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది. షారుక్ ఖాన్-అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన జవాన్ టీజర్ విడుదల కాగా యాక్షన్ ప్రియులను మైమరిపించేలా ఉంది.
రెండు నిమిషాలకు పైగా ఉన్న టీజర్ ఎక్కడా తగ్గలేదు. జవాన్ చిత్ర బడ్జెట్ రూ. 250 కోట్లని సమాచారం. ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపిస్తుంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో భారీతనం కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను గొప్పగా తీర్చిదిద్దారు. గతంలో అట్లీ నుండి ఈ రేంజ్ యాక్షన్ చూసింది లేదు. బాలీవుడ్ చిత్రాన్ని ఆయన అదే స్థాయిలో రూపొందించారు.
ఇక టీజర్లో హీరో షారుక్ ఖాన్ పాత్ర తీరు తెలియజేశారు. అసలు తానెవరో కూడా తనకు తెలియని మిస్టీరియస్ మ్యాన్ గా షారుక్ రోల్ ఉంది. అసలు షారుక్ ఎవరు? ఆయన గతంలో ఏం చేసేవాడు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? వంటి సస్పెన్సు అంశాలు పొందుపరిచారు. ఒకప్పటి జవాన్ కి ఈ స్థితికి ఎందుకు వచ్చాడనేదే అసలు కథ అనిపిస్తుంది. షారుక్ ఖాన్ లుక్స్, గెటప్స్ ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ నయనతార లుక్ చాలా స్టైలిష్ గా ఉంది.
విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తుండగా ఆయన లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ప్రియమణి పాత్ర సైతం ఆసక్తి రేపుతోంది. ఆమె లేడీ కిల్లింగ్ మెషిన్ లా ఉన్నారు. ఇక దీపికా పదుకొనె టీజర్ కి స్పెషల్ అట్రాక్షన్. ఆమె చీరలో యాక్షన్ ఇరగదీశాడు. దీపికా పదుకొనె గెస్ట్ రోల్ చేస్తుంది. మొత్తంగా జవాన్ టీజర్ అంచనాలకు మించి ఉంది. దర్శకుడు అట్లీ ఏదో గొప్పగానే ప్లాన్ చేశాడు. అనిరుధ్ బీజీఎం సైతం మెప్పించింది. జవాన్ మూవీ సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.