Dhunki Review: డంకి మూవీ ఫుల్ రివ్యూ…

రాజ్ కుమార్ హిరానీ అంటే క్లాసికల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో ఎంతవరకు తన మ్యాజిక్ ని రిపీట్ చేశారు. అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : December 21, 2023 12:52 pm

Dhunki Review

Follow us on

Dhunki Review: ప్రతి వారం కొన్ని సినిమాలు థియేటర్లోకి వచ్చి సందడి చేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు మరి ముఖ్యంగా ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చాలి అంటే అందులో హీరో హీరోయిన్ తో సంబంధం లేకుండా మొదటిగా ఆ కథ అనేది ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. ఆ తర్వాత దర్శకుడు చేసే మేకింగ్ ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సీట్లో కూర్చోబెట్టాలి.ఇక ఆ తర్వాత నటి నటులు ఎవరు అనేది మాత్రమే చూస్తారు. అంతే తప్ప ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్న ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన కూడా ఎంత మాత్రం సినిమా నిలవలేదు.ఇక ఇలాంటి క్రమంలోనే షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరాణి దర్శకత్వంలో వచ్చిన డంకి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది రాజ్ కుమార్ హిరానీ అంటే క్లాసికల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో ఎంతవరకు తన మ్యాజిక్ ని రిపీట్ చేశారు. అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా ఈ సినిమా కథ గురించి తెలుసుకుంటే ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఎలాగైనా సరే లండన్ కి వెళ్లి సెటిల్ కావాలని కోరుకుంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్లకి ఇంగ్లీష్ రాదు, వాళ్ల దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండవు కానీ ఎలాగైనా సరే వాళ్ళు లండన్ వెళ్లాలని కోరుకుంటారు.అందులో భాగంగానే సక్రమమైన పద్ధతిలో లండన్ కి వెళ్లడం వీలు కాక, అక్రమమైన పద్ధతిలో వెళ్లాలని అనుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలో వాళ్ల స్నేహితులు ఫ్రెండ్స్ చివరి వరకు కలిసి ఉన్నారా లేదా విడిపోయారా వీళ్ళ గమ్యం ఎక్కడ వరకు చేరుకుంది. అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

Also Read: సలార్ లో కెజిఎఫ్ రాఖీ భాయ్… ట్రైలర్ లో అలా హింట్ ఇచ్చిన డైరెక్టర్!

ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో రాజ్ కుమార్ హిరానీ ఎంచుకున్న కథ బావుంది. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ వేరే దేశాలకు వెళ్లి సెటిల్ అవ్వలనుకుంటున్నారు కానీ ఎవరి దగ్గర డబ్బులు ఉండవు ఇంగ్లీష్ మాట్లాడటం కూడా మెయిన్ ప్రాబ్లంగా మారుతుంది. ఇక ఇలాంటి క్రమంలో యువత కలలుగన్న లైఫ్ వాళ్ళకి ఎలా దక్కుతుంది అనే పాయింట్ కూడా చాలా చక్కగా చూపించారు. ఇక దానికి తగ్గట్టుగానే రాజ్ కుమార్ హీరాని అంటే గుండె కు హత్తుకుపోయే ఎమోషన్స్ ని చాలా బాగా డీల్ చేస్తారనే పేరైతే ఆయనకు ఉంది. కాబట్టి ఈ సినిమాలో కూడా అలాంటి సెన్సిటివ్ సీన్స్ ని చాలా చక్కగా డీల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొత్తం రాజ్ కుమార్ హిరాని తనదైన మ్యాజిక్ ను రిపీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాతో ఇంతకు ముందు తను చేసిన త్రీడిఎట్స్ పీకే ల రేంజ్ ని బ్రేక్ చేస్తాడు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే ఈ సినిమాలో సామాన్య జనాలు ఎలా ఉంటారు వాళ్ల అలవాట్లు ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు. ముఖ్యంగా రాజ్ కుమార్ హీరాని అంటే ఒక మెసేజ్ ని కమర్షియల్ వేలో చెప్పడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటారు అనే దానిని మరొకసారి ప్రూవ్ చేశారు… ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాల్లో హీరో పాత్రకి చాలా వాల్యూ ఉంటుంది.డైరెక్టర్ ప్రతి మైన్యుయార్ డీటెయిల్స్ ని కూడా చాలా క్లియర్ గా రాసుకుంటారు. అందుకే రాజ్ కుమార్ హీరాని సినిమా అంటే ప్రేక్షకుడిగా విపరీతమైన అభిమానం ఉంటుంది.అందుకే ఈ సినిమాలో రాజకుమార్ హిరానీ తన మార్క్ డైలాగులని ఎమోషన్స్ తో కలగలిపి ప్రేక్షకుడి కనుల నుంచి కన్నీరు తెప్పించే విధంగా సినిమాని డిజైన్ చేశారు.ఇక ఈ సినిమాకి రైటర్లు గా చేసిన కనిక దిల్లోన్, అభిజిత్ జోషి లు ఈ సినిమా కోసం వాళ్ల ప్రాణం పెట్టేశారు…ఇక రాజ్ కుమార్ హిరానీ కూడా రైటింగ్ లో చాలా వరకు భాగమయ్యారు. ఇక వీటితో పాటు గా అన్ని క్రాఫ్ట్ ల మీద ఆయన కున్న గ్రిప్ కూడా మనకు సినిమాలో కనిపిస్తుంది. అందుకే అతన్ని ఎంతవరకు వాడుకోవాలి ఎంతవరకు అవసరం లేదు అనే విధంగా ఆయన ఈ సినిమా ని టేకప్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. నిజానికి ఈ సినిమాలో కొన్ని సీన్లలో నటులు చేసే యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. వాళ్లు అంతలా నటించారంటే అందులో రాజ్ కుమార్ హిరానీ పాత్ర చాలా వరకు ఉంటుంది. ఒక సీన్ ని ఎలా చేస్తే ప్రతి ప్రేక్షకుడు దానికి ఎంగేజ్ అవుతాడు అనేది ఆయనకి తెలిసినంత గొప్పగా మరే డైరెక్టర్ కి తెలియదు…ఈ సినిమా చాలా బాగున్నప్పటికీ కొంచెం అక్కడక్కడ స్లో అయినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కథ బలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తెరకెక్కించే విధానంలో కొన్ని సీన్లు మనకు లాగ్ అయినట్టుగా అనిపించినప్పటికీ అవి సినిమా డెప్త్ ని ఎలివేట్ చేయడానికి వాడుకునే సీన్లు కావడం వల్ల మనం వాటిని సినిమా నుంచి తీసేయలేం అలాగని ఉంచితే ఆ సీన్స్ కొంత మంది ఆడియన్స్ కి అంత తొందరగా ఎక్కకపోవచ్చు అయినప్పటికీ వాటిని సక్సెస్ ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటుంది…కొన్ని ఎమోషన్ సీన్స్ లో ప్రీతం చక్రవర్తి ఇచ్చిన మ్యూజిక్ చాలావరకు సినిమాకు ప్లస్ అయింది. కొన్ని సీన్స్ ఎలివేట్ అవ్వడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా వరకు హెల్ప్ చేసింది…

ఇక ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ విషయానికి వస్తే షారుక్ ఖాన్ ఎప్పటిలాగే తనదైన రీతిలో యాక్టింగ్ చేస్తూ తనదైన రీతిలో మరొకసారి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే ఎమోషన్స్ సీన్స్ లో షారుఖ్ ఖాన్ హావభావాలు మాత్రం ఎప్పుడు చూడని విధంగా చాలా ఫ్రెష్ గా ఉంటూనే ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. అలాగే తాప్సీ కూడా అదే రేంజ్ లో సేటిల్డ్ గా తను పర్ఫాం చేసింది…ఇక బొమ్మనిరాని, విక్కీ కౌశల్ లాంటి వారు తమదైన రీతిలో తమ క్యారెక్టర్ లో ఉన్న సోల్ ని పట్టుకొని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. తను కూడా సినిమా సక్సెస్ లో చాలా వరకు భాగమయ్యారు… ఆర్టీస్టులందరూ కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు…

Also Read: ప్రభాస్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే…

ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన ప్రీతం చక్రవర్తి తనదైన రీతిలో మ్యూజిక్ ని అందించాడు. ఇంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మాత్రం సినిమాకి చాలా వరకు హెల్ప్ చేశాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ వల్లే సినిమా ఆల్మోస్ట్ సక్సెస్ ఫుల్ గా సాగింది…ఇక మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది…కొన్ని సీన్లలో విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. ముఖ్యంగా లండన్ వెళ్లడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని షాట్స్ వస్తాయి వాటిని విజువల్ గా చాలా బాగా చూపించారు…ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ మీద వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా భారీగా రిచ్ లెవెల్ లో ఉన్నాయి…

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే

కథ, డైరెక్షన్
కొన్ని ఎమోషన్ సీన్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
షారుక్ ఖాన్ తాప్సి నటన
సినిమాటోగ్రఫీ

ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే

మధ్యలో కొంచెం సినిమా లాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ బోర్ కొడుతుంది…

కొన్నిచోట్ల ఎమోషన్ ని బిల్ చేయడంలో డైరెక్టర్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది…

ఇక ఈ సినిమాలో ఈ మైనస్ పాయింట్స్ ని మినహా ఇస్తే పెద్దగా చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ అయితే ఏమి లేవు కాబట్టి సినిమాని ఈ వీకెండ్ లో ప్రతి ఒక్కరు వాళ్ల ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3/5