![]()
Opposition leaders vs Modi : దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో చార్జిషీట్‌లో కనీసం పేరు కూడా లేని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశాయి. దీంతో ఆప్, బీఆర్‌ఎస్‌లో టెన్షన్ మొదలైంది. అరెస్ట్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. దర్యాప్తు సంస్థలు కేంద్రం కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని విమర్శించారు.
సిసోడియా ఇంట్లో, ఆఫీసుల్లో తనిఖీలు..
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొదట ఢిల్లీ ఎక్సైజ్ మంత్రి మనీశ్ సిసోడియాను దర్యాప్తును విచారణ చేశాయి. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశాయి. బ్యాంకు లాకర్లను కూడా తెరిచి చూశాయి. కానీ ఒక్క ఆధారం కూడా పట్టుకోలేదు. దీంతో ఈ స్కాంలో ఉన్న ఇతర వ్యాపారులు, నేతలపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. ఒక్కొక్కరినీ విచారణ చేస్తూ ఇప్పటికే 15 మంది వరకు అరెస్ట్ చేశాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఐదుసార్లు చార్జిషీట్ దాఖలు చేశాయి. ఇందులో కూడా మనీశ్ సిసోడియా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. తెలంగాణ సీఎం కూతురు కవిత పేరు ఎక్కువసార్లు ప్రస్తావించాయి. ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చేర్చాయి.
ఊహించని విధంగా సిసోడియా అరెస్ట్..
మద్యం కుంభకోణంపై వేగంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ ఎవరూ ఊహించని విధంగా సిసోడియాను అరెస్ట్ చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని వేర్వేరుగా, కలిపి విచారణ చేశాయి దర్యాప్తు సంస్థలు. ఈ సందర్భంగా సిసోడియా గురించి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. దీంతో మరోమారు విచారణకు రావాలని సీబీఐ మనీశ్ సిసోడియాకు నోటీసులు పంపింది. అయితే తాను బడ్జెట్ రూపకల్పనలో ఉన్నానని, దర్యాప్తునకు రాలేనని సీబీఐకి వివరణ ఇచ్చారు. తర్వాత వస్తానని తెలిపారు. ఇందుకు అంగీకరించిన సీబీఐ, ఆయన ఇచ్చిన సమయానికి విచారణకు వెళ్లాడు సిసోడియా. విచారణకు వెళ్లే ముందే తాను జైలుకు వెళ్లడం ఖాయం అని స్వయంగా ప్రకటించారు. ఊహించినట్లుగానే సీబీఐ అరెస్ట్ చేసింది.
ప్రధానికి నలుగురు సీఎంలు.. ఐదుగురు విపక్ష నేతల లేఖ..
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్‌ను విపక్షాలు ఖండించాయి. ఎలాంటి ఆధారం లేకపోయినా సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టాయి. తాజాగా నలుగురు ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్‌మాన్, మమతాబెనర్జీతోపాటు విపక్ష నేతలు తేజస్వి యాదవ్, అఖిలేష్‌యాదవ్, శరద్‌పవార్, ఉద్ధవ్ ఠాక్రే, ఫారూఖ్ అబ్దుల్లా ప్రధానికి లేఖ రాశారు. సిసోడియా అరెస్ట్‌ను ఖండించారు. దర్యాప్తు సంస్థలను సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటూ ఇలా ఎంతమందిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
మొత్తంగా సిసోడియా అరెస్ట్‌పై విపక్షాలు ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నం చేశాయి. అయితే లేఖ రాసిన పార్టీలన్నీ వినీతి ఆరోపణలు ఎదుక్కొంటున్నవే కావడం గమనార్హం. మరి విపక్షాల లేఖపై మోదీ ఎప్పుడు స్పందిస్తారు.. ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.