Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సంచలన అంశాలు..

Pawan Kalyan : కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సంచలన అంశాలు..

Pawan Kalyan : గత మూడు రోజుల నుండి పవన్ కళ్యాణ్ జనసేన ‘వారాహి విజయ యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఏ రాజకీయ పార్టీకి కూడా రానటువంటి రెస్పాన్స్ , ఈ వారాహి యాత్ర ద్వారా జనసేన పార్టీ కి వస్తుంది, ఈ స్థాయి అనూహ్యమైన రెస్పాన్స్ ఇది వరకు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చాయి, ఇది కొత్తేమి కాదు, కానీ ఈ ‘వారాహి విజయయాత్ర’ కి మాత్రం ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.  కాకినాడ లో నేడు జరిగిన భారీ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ చేస్తున్న అక్రమాలను చెప్పుకొచ్చాడు.

కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సంచలన అంశాలు ఇవీ..

• ఒక దేశపు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు…కలల ఖనిజాలతో చేసిన యువత…..
యువతని ఓట్ల కోసం వాడుకుంటున్నారు …కానీ నా వంతు సాయం, కృషి, ఒక బలమైన సమాజం కోసం నేను ఉన్నాను.

• కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు రిటైర్మెంట్ హబ్ అని పిలుస్తారు.. మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది..
• ప్రజాస్వామ్యం అనేది మన నాయకులు సరిగ్గా లేకపోతే అస్తవ్యస్తంగా అయిపోతుంది.. స్వలాభం చూసుకుంటే కాకినాడ లా సమస్యల్లో ఉంటుంది.

• నాకు ఈ కౌన్ కిస్కా కాకినాడ గొట్టం ఎమ్మెల్యేతో గొడవ ఏముంది….. క్రిమినల్స్ రాజ్యాలు ఏలితే ఇంతే.

• ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాకినాడ ఎమ్మెల్యే లాంటి క్రిమినల్స్ కి అండగా ఉంటే మనం ఏం చేయాలి.. క్రిమినల్స్ కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ ని మార్చేస్తున్నారు..

• స్థానిక కాకినాడ ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తప్ప తాగి, అహంకారంతో ఏమైనా వాగొచ్చు అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్లు మాట్లాడాడు… దిగజారుడు బూతులు మాట్లాడుతుంటే మా నాయకులు తెలియజేశారు..

• అప్పట్లో ఎస్పీ డీటీ నాయక్ దొంగనోట్లు, అక్రమ మద్యం, అరాచకాలు చేసే ద్వారంపూడి కుటుంబ సభ్యులను బేడీలు వేసి రోడ్ల మీద నడిపించారు..

• మా జనసైనికులు, మహిళలు, నాయకుల మీద రాళ్ళ దాడి చేశారు ద్వారంపూడి అనుచరులు… నేను వస్తున్నా అనగానే 144 సెక్షన్ పెట్టారు తూ.గో.జిల్లా అంతా

• ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనేవాడు నా కోపం అణుచుకోవడం వలన బతికిబట్టకట్టాడు.

• ప్రజలకు మంచి చేస్తే నాకు ఇబ్బంది లేదు… రౌడీయిజం, లూటీ, కబ్జాలు చేస్తే నా లాంటి వాడు సహించలేడు….. వీళ్ళు మనుషుల్ని సమాజాన్ని కులాలుగా విడదీసి రాజకీయం చేస్తూ, ద్వేషాలు పెంచుతున్నారు..

• ఇంకొసారి కులదూషణ చేసావా, రెచ్చగొట్టావా ఇక మర్యాదగా చెబుతున్నాను….. పద్దతి మార్చుకో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.

• ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెనుక తిరిగే దళిత, కాపు యువకులకు చెబుతున్నాను…..మీ దళిత డ్రైవర్ ని చంపిన వైసీపీ ఎమ్మెల్సీ, మీ పథకాలు పీకేసిన ముఖ్యమంత్రి, ఈ డెకాయిట్ వెనుక తిరిగే మీకు ఈ విషయాల మీద అవగాహన తెచ్చుకుని నడుచుకోండి .

• క్రైమ్ చేసే వాడు ఏ కులమైనా వదిలేదే లేదు…. కాకినాడ అర్బన్ లో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఓడించే బాధ్యత నాది.

• ఈ రోజు నుండి ఉభయగోదావరి జిల్లాల్లో ఎవడు మీపై గూండాగిరి చేసినా, మీకు అండగా నేనుంటాను..

• బాపట్లలో గౌడ కులానికి చెందిన ఒక పిల్లాడిని రెడ్డి కులం వాడు తగలపెట్టి చంపేశాడు…..వాళ్ళ అక్కను ఏడిపిస్తున్నాడని అడ్డుపడినందుకు ఈ పరిస్థితి..

• కాకినాడ నుండి పిఠాపురం వరకు, గోదావరి జిల్లాల్లో ద్వారంపూడి అనేవాడు ముఖ్యమంత్రి అని చెబుతూ ఉన్నారు….. రైస్ ఎక్స్పోర్ట్ లో 15000 కోట్లు వెనకేశాడు… అన్నీ అక్రమాలే….బలహీనులని పీక్కుతింటున్నాడు…ఏ మూలకి వెళ్ళినా ఈ డెకాయిట్ దోపిడీలు చేస్తున్నాడు.

• ఇక్కడ ఉన్న యువతకు చెబుతున్నాను… కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు… కాపు రిజర్వేషన్ కోసం ఏ గవర్నమెంట్ లో అయినా ఒకేలా ఉండాలి…మీ ఎదుగుదల కోసం కాపు కులాన్ని వాడుకోవద్దు..

• దళితులను, గౌడ బిడ్డలను చంపుతుంటే దళిత, గౌడ నాయకులకు కోపం రాలేదా???
బిడ్డ చనిపోతే లక్ష చేతిలో పెట్టి తప్పును కప్పేస్తున్నారు..

• సినిమాల్లో మీరు ఎవరి అభిమాని అయినా సరే రాజకీయంగా మీరు అందరూ జనసేనకి మద్దతు ఇవ్వండి…యువత మారాలి.
• ఏ కులమైనా మీరు ఆలోచించాల్సింది మీకు ఉద్యోగాలు, ఉపాధి, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి ఈ ప్రభుత్వం చేయడం లేదు.
• క్యాపిటలిజం,సోషలిజం లాంటివి మీరు అవగాహన చేసుకోవాలి…. డబ్బు ఉన్న వాడు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు, లేని వాడు ఇంకా పేదవాడిగా మారిపోతున్నారు.
• నిజజీవితంలో పోరాడాలంటే గట్స్, దమ్ము, ధైర్యం ఉండాలి ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఎదుర్కోవాలంటే…. అందుకే జనసేనకి అవకాశం ఇవ్వండి.
• పెట్టుబడి ఉండాలి, వ్యాపార క్యాపిటల్ పెట్టాలి…. జనసేన ప్రభుత్వం రాగానే చేసి చూపిస్తాం.
• నేను సోషల్ ఇంజినీరింగ్ చేస్తున్నాను కులాలను కలుపుతూ…. ఆంధ్రప్రదేశ్ అనే భావన మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండాలి… నేను చేసి చూపిస్తున్నాను… చేస్తూనే ఉంటాను.
• ఈ రాష్ట్రాన్ని సాధించింది ఒక వైశ్య కులానికి చెందిన పొట్టిశ్రీరాములు గారు.. ఆయనకి నా నమఃసుమాంజలి … వైశ్యులు ధైర్యవంతులు.
• ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నీ గూండాలు ఆడపిల్లల జోలికి, వస్తే నీ తాతకి డీటీ నాయక్ తాట తీసినట్టు నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాను…..ఆ రోజు దగ్గర్లోనే ఉంది..కాసుకో నీ పతనం మొదలైంది….. నీ క్రిమినల్ రాజ్యాన్ని కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.
• జయలక్ష్మి బ్యాంకు డిపాజిటర్లని రక్షించండి….. కలెక్టర్లని అడుగుతున్నాను.. స్పందించండి.
• కాకినాడ రూరల్ చుట్టూ నీటి ఎద్దడి నెలకొంది… పరిష్కారం చేయాలి…. ఏదైనా మాట్లాడితే కన్నబాబు ఫీల్ అవుతాడు.
• ఖాళీ స్థలాలు కనిపిస్తే నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో వచ్చి కబ్జా చేయడం, జనాల ఇళ్ళు లాక్కోవడం ఇది ఈ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గాడి దందా.
• డీజీపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ బావుంది అన్నారు…..
ఈ లెక్కలు మీ కోసమే…2019లో 8224, 2020లో-9287, 2021లో- 10085, ఆడపిల్లల మిస్సింగ్ కేసులు ఉన్నాయి… ఇంకెక్కడ ఉంది లా అండ్ ఆర్డర్????  డీజీపీ తెలుసుక..

• దళితులు, గౌడలు మీద దాడులు ఆగాలి.. పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉంటాడు,మీ సమస్యను అర్థం చేసుకున్నాను.
• కాకినాడ పోర్టు నుండి అక్రమంగా బియ్యం రవాణా అవుతుంది….పంపకాల తేడాలు ఉన్నాయి…56 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దోచేసారు… గిట్టుబాటు ధర లేక రైతు బాధపడుతుంటే వీళ్ళు చేసే దందా ఇది రేషన్ వాహనాలు పెట్టి…. వీటన్నింటికి సూత్రధారి ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి…అది వాడి బలుపు….జనసేన వస్తే ఈ దోపిడీ అరికడతాం.
• ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తండ్రి, కుటుంబం అంతా గోదావరి జిల్లాల ధాన్యాన్ని దోచేస్తుంటే కన్నబాబు, తోట త్రిమూర్తులు ఏం చేస్తున్నారు??? అడిగే దమ్ము లేదా మీకు??
• మధ్యతరగతి ప్రజలకు విన్నపం….మీరంతా మౌనాన్ని, భయాన్ని వీడండి…. జనసేనని గెలిపించండి.
• ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే కోవిడ్ రోగుల కోసం ఉన్న బెడ్లు,వంటసామాన్లు కూడా పట్టుకెళ్ళిన చీప్ చరిత్ర ఇతనిది.
• నవంబర్, డిసెంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి…..1500 కోట్లు రెడ్లకి అక్రమంగా కట్టబెట్టారు…ఎన్నికలకు ఈ డబ్బు వాడబోతున్నారు.
• తాడేపల్లిలో 2021 సీఎం ఇంటి దగ్గర ఒక ఆడపిల్లని ముగ్గురు అత్యాచారం చేస్తే ప్రసన్న” రెడ్డి” అనే నిందితుడు ఇప్పటివరకు దొరకలేదు …. ఆడపిల్లలు ఈ ప్రభుత్వం ఉదాసీనత వలన బలైపోతున్నారు.
• కడప జిల్లాలో 15 ఏళ్ళ బిడ్డను అత్యాచారం చేస్తే, 8 నెలల తరువాత గర్భవతి అయ్యాక బయటపడింది ఈ దారుణం, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అత్యాచారం జరిగితే మహిళా హోంమంత్రి అత్యాచారం చేయడానికి రాలేదు దొంగతనానికి వచ్చారు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఆవిడ.
• మీరందరూ యువత, మీరు మేల్కోకపోతే ,అన్యాయం జరుగుతున్నప్పుడు కోపం రాకపోతే ఎలా??
• ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెనుక 500 మంది గూండాలు ఉంటారు…వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయలేరా?? నిలబడండి అన్యాయానికి అడ్డుగా…. సమస్యను అర్థం చేసుకుని ముందుకెళ్ళండి కులాలకు అతీతంగా.
• ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దోపిడీని ఎదుర్కోవాలంటే ఈ హ్యాష్ ట్యాగ్ వాడి ఏపీ డీజీపీ, అమిత్ షా గారి ఆఫీస్ కి , జనసేన ఆఫీస్ ట్యాగ్ చేసి దౌర్జన్యాల ఫోటోలు తీసి ట్రెండ్ చేసి దేశమంతా తెలియజేద్దాం. కలుగులో ఎలుకలను బయటకు లాగుదాం.
#APCMBINAMI
#APCMDGANG
#YSJAGANBINAMI
#YSJAGANGANG

• జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున క్రిమినల్స్ అందరినీ తాట తీస్తాం… ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బలిసి కొట్టుకుంటున్నావ్…. నీకు రోజులు దగ్గరపడ్డాయ్…నీ నాయకుడికి కూడా ఈ మీటింగ్ వీడియో పంపించు…. మిమ్మల్ని రోడ్డుమీద ఈడుస్తా.

https://www.youtube.com/watch?v=EaILFxLjAmY

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular