J&K Police : నిన్న కశ్మీర్ లో జరిగినటువంటి సంఘటనలు దేశాన్ని కుదుపు కుదిపేశాయి. ఒకటి రాజోరీ సెక్టర్. రెండోది అనంతనాగ్ జిల్లా గధోల్ అటవీప్రాంతం. మొదటిది పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్టులను హతం చేయడానికి వెళ్లినటువంటి రైఫిల్ మ్యాన్ రవికుమార్ చనిపోయారు. ఆరు సంవత్సరాల మన రక్షణ కుక్క చనిపోయింది. ఆ కుక్క ఎంతోమంది ఉగ్రవాదులను పట్టించింది. ఆ ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. అది మనకు ఊరట.. కానీ పోయిన రవికుమార్, కుక్కను తిరిగి తీసుకురాలేదు.
అంతకన్నా ఆందోళన కలిగించే సంఘటన.. అనంతనాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం 19 రాష్ట్రీయ రైఫిల్స్ టీం చేరింది. అక్కడ చీకటి పడడంతో ఆపేశారు. బుధవారం ఉదయం ఆపరేషన్ మొదలుపెట్టారు. కొండపైన వారు దాక్కోవడంతో వారిని హతమార్చడానికి వెళ్లిన కల్నర్ మన్ ప్రీత్, మేజర్ ఆషిస్, డిప్యూటీ ఎస్పీ హుమాయన్ భట్ ఈ ముగ్గురూ స్పెషల్ పోలీసులు హైర్యాంక్ ఆఫీసర్స్. ఈ ముగ్గురూ ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఇది ప్రతీ ఒక్కరూ బాధపడాల్సిన విషయం . ఆ అమర వీరులకు శిరస్సు వంచి నమసుమంజులు. మనందరం సురక్షితంగా ఉంచడం కోసం వారు ప్రాణాలకు తెగించి చనిపోయారు. దీన్ని తెలుగు మీడియా అస్సలు పట్టించుకోకవడం గమనార్హం.
కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో సీనియర్ ఆర్మీ అధికారుల మృతి చెందిన ఘటనపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.