Yogi Adityanath : యోగి ఆధిత్యనాథ్ ఆధ్వర్యంలో ఒక బీమారి రాష్ట్రం ఇవ్వాళ అభివృద్ధి పథంలో ఎలా దూసుకెళుతోంది. దానికి వారు తీసుకున్న ప్రణాళిక ఏమిటీ? దీనిపై సమగ్ర పరిశీలన చేస్తే..
ఏ రాష్ట్రమైన వ్యవసాయాన్నే నమ్ముకుంటే అభివృద్ధి కాదు. తయారీ రంగం, సర్వీస్ రంగం పెరిగితే అభివృద్ధి సాధిస్తుంది. టూరిజం ఉత్తరప్రదేశ్ కు పెద్ద ఆస్తి. అయోధ్య పూర్తి అయితే రికార్డు స్థాయిలో టూరిస్టులు వస్తారు. సర్వీస్ రంగంలోని హోటల్స్, గైడ్స్, వెహికల్స్ సహా అన్ని అభివృద్ధి అవుతుంది.
తయారీ రంగం కూడా పశ్చిమ యూపీలో అద్భుతంగా ఉంది. నోయిడాలో దేశంలో మొత్తం మొబైల్ ఫోన్లలో 45 శాతం యూపీలోనే తయారవుతున్నాయి.విడిభాగాలు 55శాతం, కొత్తగా డేటా సెంటర్ లు ఇక్కడ వెలుస్తున్నాయి. దాంతోపాటు యూపీకి ఏం కావాలంటే.. ఏ రాష్ట్రానికైన జీడీపీ పెరగాలన్నా.. అభివృద్ధి జరగాలన్న పట్టణీకరణ జరగాలి. టూరిజంతో ఇది సాధ్యమవుతుంది. అర్బనైజేషన్ జరగకుండా అభివృద్ధి జరగదు.
2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే యూపీలో పట్టణీకరణ దేశంతో ( పోలిస్తే 22 శాతం మాత్రమే శాతం) ఉంది. సంఖ్యాపరంగా 4.50 కోట్ల మంది యూపీలో పట్టణాల్లో జీవిస్తున్నారు. సంఖ్యాపరంగా తక్కువ ఏం లేదు. మొత్తం పట్టణాలు చూస్తుంటే 474 ఉన్నాయి.
ప్రస్తుత నగరాల అభివృద్ధి, కొత్త నగరాల ఏర్పాటు యోగీ అభివృద్ధి మంత్రం జరపుతున్న వైనంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.