వాట్సాప్ సూపర్ ఫీచర్.. ఒక్క టచ్ తో ఆడియో మ్యూట్..!

దేశీయ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ యాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ యాప్ తెస్తున్న కొత్త ఫీచర్లు యూజర్లను ఆకర్షించడంతో పాటు యూజర్లను వాట్సాప్ వినియోగదారులకు మరింత చేరువ చేస్తున్న సంగతి తెలిసిందే. మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా వీడియోను షేర్ చేసిన సమయంలో అభ్యంతరకర మాటలను తొలగించవచ్చు. అవసరమైతే మొత్తం ఆడియోను తీసేసి వీడియోను […]

Written By: Kusuma Aggunna, Updated On : February 28, 2021 6:45 pm
Follow us on

దేశీయ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ యాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ యాప్ తెస్తున్న కొత్త ఫీచర్లు యూజర్లను ఆకర్షించడంతో పాటు యూజర్లను వాట్సాప్ వినియోగదారులకు మరింత చేరువ చేస్తున్న సంగతి తెలిసిందే. మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా వీడియోను షేర్ చేసిన సమయంలో అభ్యంతరకర మాటలను తొలగించవచ్చు.

అవసరమైతే మొత్తం ఆడియోను తీసేసి వీడియోను పంపే అవకాశం ఉండటం గమనార్హం. అయితే వాట్సాప్ కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకున్న కొంతమందికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా మరి కొంతమందికి మాత్రం కొత్త ఫీచర్ అప్ డేట్ రావాల్సి ఉంది. ఆ ఆప్షన్ ను ఉపయోగించుకోవడం కూడా కష్టమేమీ కాదు. ఎవరికైనా వీడియోను షేర్ చేసే సమయంలో సౌండ్ సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ ను మ్యూట్ చేస్తే సరిపోతుంది.

వాట్సాప్ బీటా వెర్షన్ ను వినియోగిస్తున్న వారికి ఈ ఫీచర్ అప్ డేట్ అయిందని తెలుస్తోంది. మరోవైపు వాట్సాప్ బృందం కొత్త ప్రైవసీ పాలసీ గురించి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు టెక్ నిపుణులు అభిప్రాయపడుతుండటం గమనార్హం. వాట్సాప్ మీడియా షేరింగ్ లే అవుట్ ను మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు అప్ డేట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా వాట్సాప్ కల్పిస్తూ ఉండటం గమనార్హం.

వాట్సాప్ ఫోటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్స్ ను షేర్ చేసే సమయంలో టెక్స్ట్ మెసేజ్ బెలూన్ ను రూపొందించగా ఈ బెలూన్ అలైన్ మెంట్ చిన్నదిగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సంగతి తెలియాల్సి ఉంది.