https://oktelugu.com/

బెంగాల్ లోనూ అదే సీన్ : ఏపీ పరిస్థితి రిపీట్ అవుతుందా..?

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో త్వరలో మినీ సంగ్రామం జరగబోతుంది. మిగతా వాటి పరిస్థితి ఎలాగున్నా పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంపీ) ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఇక్కడ పలు పర్యటనలు చేసిన ఆయన టీఎంసీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2021 / 02:14 PM IST
    Follow us on

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో త్వరలో మినీ సంగ్రామం జరగబోతుంది. మిగతా వాటి పరిస్థితి ఎలాగున్నా పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంపీ) ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఇక్కడ పలు పర్యటనలు చేసిన ఆయన టీఎంసీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను లాగేసుకున్నారు. టీఎంపీ అధినేత, సీఎం మమతా బెనర్జీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తూ నిద్ర లేకుండా చేస్తున్నారు. తాజాగా బీజేపీ మరో వ్యూహంతో రంగంలోకి దిగింది. దీంతో మమతకు మరింత క్లిష్ట పరిస్థితి తయారైంది.

    ఆంధ్రప్రదేశ్లో 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు అప్పటివరకు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు కేంద్రానితో కయ్యం పెట్టుకున్నారు. ఈ సదవకాశాన్ని చేజిక్కించుకున్న జగన్ బీజేపీతో కలిసిపోయారు. దీంతో జగన్ అధికారంలోకి రావడాకికి కేంద్రం సహకారం ఉందని ఇప్పటికీ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి జగన్ ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అయితే అంతకుముందు జరిగిన కొన్ని పరిణామాల వల్లే జగన్ అధికారంలోకి వచ్చారన్న వాదన ఉంది.

    ఎన్నికల ముందు అధికారులందరినీ మార్చేపని ఈసీ చేసీంది. సీఎస్ నుంచి డీజీపీ,కలెక్టర్లు తదితర ముఖ్య అధికారులందరినీ ఈసీ మార్చేసింది. అయితే కేంద్ర అనుమతి లేనిది ఈసీ ఏ పని చేయదని అందరికీ తెలుసు. దీంతో ఆ సమయంలో బీజేపీ పెత్తనంతోనే ఈ తతంగం నడిపించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇక కొందరు తమపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారని కొందరు అనుకుంటున్నారని, తామేం తప్పు చేయలేదన్నారు. అయితే తమను కారణం లేకుండానే ఈసీ బదిలీ చేసిందని అప్పటి సీఎష్ గొపాలకృష్ణ ద్వివేదీ అన్నారు.

    ప్రస్తుతం బెంగాల్ లోనూ అదే సీన్ జరుగుతోంది. ఉన్నఫలంగా బెంగాల్ లోని ముఖ్య అధికారులందరినీ ఈసీ మార్చేస్తుంది. దీంతో ఈ తతంగంగ అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతుందని కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే టీఎంసీ నుంచి ఎలా వీలైతే అలా అందులోని నాయకులందరినీ పార్టీలో చేర్చుకుంటున్న కమలం నాయకులు చివరకు టీఎంసీని లేకుండా చేస్తారా..? అని అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని ఎన్నికలు పూర్తయ్యే వరకు మమతా ఎలా నెగ్గుకొస్తారోనన్న చర్చ ఆసక్తిగా మారింది.