Happy Sankranthi Greetings 2024: సంక్రాంతి పండుగ తెలుగువారి ఇళ్లల్లో సంబరాలు తెస్తుంది. ఈ పండుగ వస్తుందంటే 10 రోజుల ముందు నుంచే ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రపచంలో ఎక్కడెక్కడో ఉన్న బంధువులంతా ఒక్కచోటుకు చేరుతారు. ఈ సందర్భంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు. పిండివంటలు, ఆటపాటలతో సంతోషంగా ఉంటారు. ఈ సందర్భంగా సందర్భంగా ఇతరులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే సాధారణంగా కాకుండా కొన్ని ప్రత్యేక పదాలతో పండుగ విషెష్ చెప్పడం ద్వారా వారి మనసుకు దగ్గర కొవొచ్చు. మరి ఆ విషెష్ ఎలా చెప్పాలంటే?
ఒకప్పుడు ఒకరికొకరు కలుసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకునేవారు. ఆ తరువాత గ్రీటింగ్ కార్డులను పంచి విషెష్ చెప్పారు. అనంతరం మొబైల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత మెసేజ్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ తెలుగులో విషెష్ చెబుతూ ఆకట్టుకుంటున్నారు. కొందరు ప్రత్యేక గ్రీటింగ్స్ ద్వారా అలరిస్తున్నారు. అయితే తెలుగుపండుగ సందర్భంగా అందమైన తెలుగుపదాలతో ఇలా విషెష్ చెప్పి ఆకట్టుకోండి..

-వెలుగులు విరజిమ్మే సంక్రాంతి పండుగ మీ జీవితంలో ఆనందం నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఈ సంక్రాంతి మీ కుటుంబంలో శుభాలు కలిగించాలని మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

-సూర్యుని కొత్త ప్రయాణం.. మీ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఉత్తరాయణ పుణ్యకాలం.. మీ ఇంట విరియాలి ఆనందం.. సంక్రాంతి శుభాకాంక్షలు.
-మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ పండుగ కు ఆనందంగా గడపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు.
-కొత్త పండుగ.. కొత్త జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు.