https://oktelugu.com/

సంక్రాంతి విశిష్టత ఇదే.. పండుగ రోజున చేయాల్సిన పనులేంటంటే..?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రాంతి అంటారు. కొత్తదనానికి స్వాగతం పలికే సంక్రాంతి పండుగ రోజున విష్ణుమూర్తికి పూజలు చేస్తాం. రైతులు పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో జరిపే పండుగ కాబట్టి ఈ పండుగను రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. Also Read: భోగి ప్రత్యేకం: చిన్న పిల్లలకు భోగి పళ్ళను ఎందుకు పోస్తారో తెలుసా..? ప్రతి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 13, 2021 / 10:00 AM IST
    Follow us on


    తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రాంతి అంటారు. కొత్తదనానికి స్వాగతం పలికే సంక్రాంతి పండుగ రోజున విష్ణుమూర్తికి పూజలు చేస్తాం. రైతులు పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో జరిపే పండుగ కాబట్టి ఈ పండుగను రైతుల పండుగ అని కూడా పిలుస్తారు.

    Also Read: భోగి ప్రత్యేకం: చిన్న పిల్లలకు భోగి పళ్ళను ఎందుకు పోస్తారో తెలుసా..?

    ప్రతి సంవత్సరం జనవరి మాసంలో సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగ రోజున కొన్ని పనులు చేయడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చు. సంక్రాంతి పండుగ రోజున అన్నదానం, పుస్తకదానం, సువర్ణ దానం, వెండి దానం, భూదానం, గుమ్మడికాయ, ఉప్పు దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పరమాన్నం, పిండి వంటలు చేసి శ్రీమన్నారాయణుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

    Also Read: భోగి మంటలెందుకు? భోగి పళ్ళ వేడుకల వెనుక ఉద్దేశ్యమేంటి? సంప్రదాయం వెనుక కథ

    సంక్రాంతి పండుగ రోజున పితృ దేవతలకు నల్ల నువ్వులతో తర్పణాలు ఇవ్వడం వల్ల సంవత్సరంలోని అన్ని సంక్రాంతులకు తర్పణాలు ఇచ్చినట్టు అవుతుందని పెద్దలు చెబుతున్నారు. సంక్రాంతి రోజున పితృ దేవతలను ఆరాధిస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది. పండుగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి సూర్య భగవానుడిని ఆరాధించాలి. సంక్రాంతి పండుగ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

    మరిన్ని వార్తలు కోసం:ప్రత్యేకం

    సంక్రాంతి పండుగ రోజున దాన ధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. సంక్రాంతి పండుగ రోజున స్త్రీలు తెల్లవారుజామున ఇంటి ముంగిళ్లలో రంగవళ్లులను తీర్చిదిద్దుకోవాలి. ఈ పండుగకు పలు ప్రాంతాల్లో కోళ్ల పందేలు, ఎడ్ల బళ్ల పందేలు జరుగుతాయి.