Samantha Ruth Prabhu : ఆ తెలుగు హీరో అంటే ఇష్టం.. తన క్రష్ ఎవరో చెప్పి షాకిచ్చిన సమంత…

ఇక ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులని కూడా సైన్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి సమంత మళ్ళీ తెలుగు లో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి...

Written By: NARESH, Updated On : March 16, 2024 9:24 pm
Follow us on

Samantha Ruth Prabhu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దాదాపు 14 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఏకైక హీరోయిన్ సమంత.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగడం విశేషం… ఇక ఇదిలా ఉంటే సమంత రీసెంట్ గా ‘ఇండియాటుడే కాన్ క్లేవ్ 2024’ లో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న ఆవిడ మీడియాతో మాట్లాడుతూ తన క్రష్ ఎవరో తెలియజేసింది. ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా అయిన షారుఖ్ ఖాన్ అంటే ఆమెకి అమితమైన గౌరవమని చెప్పింది.

ఇక ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ అంటే మాత్రం తనకి ‘క్రష్ ‘ ఉందని.. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకు చాలా గౌరవం అని తెలియజేసింది…ఇక అలాగే తన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలియజేస్తూ కెరియర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడు కేవలం 5,6 గంటలు మాత్రమే పడుకునే దానినని అనారోగ్య పరిస్థితి వల్ల తన స్టార్ డమ్ ను ఎప్పుడు ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పింది…

ఇక ఇదిలా ఉంటే సమంత గత సంవత్సరం శాకంతులం, ఖుషి అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినప్పటికీ ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అయితే అందుకోలేదు. ఇక దాంతోపాటుగా ప్రస్తుతం ఆమె కొన్ని క్రేజీ ప్రాజెక్టులను కూడా ఓకే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వెబ్ సిరీస్ ల్లో ‘సిటాడెల్ ‘(ఇండియన్ వెర్షన్) రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులని కూడా సైన్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి సమంత మళ్ళీ తెలుగు లో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…