Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ లో 8వ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకున్నాడు యూపీ సీఎం యోగి. కానీ అసలు విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు. అంతకన్నా పెద్ద వ్యూహాన్ని యోగి రచించాడు. రాయ్ బరేలిలో 8 మంది ఎమ్మెల్యేలు వచ్చి సపోర్టు చేసి బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి సపోర్టు చేసి గెలిపించారు.
రాయ్ బరేలి సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ పాండే కూడా బీజేపీకి ఓటు వేయడం విశేషం. ఇది ఓ అనూహ్య తిరుగుబాటు. యోగి దీన్ని చక్కగా వాడాడు. రాయ్ బరేటి సమాజ్ వాదీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం అనూహ్యమైన చర్యగా చెప్పొచ్చు. రాజ్యసభలో ఎవరికైనా ఓటు వేసి గెలిపించవచ్చు. అది చట్టప్రకారం కరెక్ట్. పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి ఉండదు. మనోజ్ కుమార్ పాండే కాంగ్రెస్ చీఫ్ విప్ పదవిలో ఉన్నారు. ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.
అనూహ్యంగా మనోజ్ కుమార్ పాండే ని తెరమీదకు తెచ్చిన యోగీ.. అసలు ఎవరీ మనోజ్ కుమార్ పాండే.? ఆయన కథ ఏంటన్నది ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.