Salaar Twitter Review: సలార్ ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ సినిమాకు ఊహించని టాక్, హైలెట్స్ ఇవే!

సలార్ కథ విషయానికి వస్తే... దేవ(ప్రభాస్)కి వరదరాజు(పృథ్విరాజ్) బాల్య స్నేహితుడు. వరదరాజు అనే దేవకు ప్రాణం. అతని కోసం ఎంతకైనా తెగించే తత్త్వం. అనూహ్యంగా బాల్యంలోనే వరదరాజును దేవ వదిలివెళ్ళిపోతాడు.

Written By: NARESH, Updated On : December 22, 2023 8:41 am

Salaar Twitter Review

Follow us on

Salaar Twitter Review: భారీ అంచనాల మధ్య సలార్ నేడు విడుదలైంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. సలార్ చిత్ర ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. హైప్ మరింతగా పెంచేశాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 21 అర్థరాత్రి నుండే ప్రీమియర్స్ ప్రదర్శన జరుగుతుంది. దీంతో సలార్ టాక్ బయటకు వచ్చింది.

సలార్ కథ విషయానికి వస్తే… దేవ(ప్రభాస్)కి వరదరాజు(పృథ్విరాజ్) బాల్య స్నేహితుడు. వరదరాజు అనే దేవకు ప్రాణం. అతని కోసం ఎంతకైనా తెగించే తత్త్వం. అనూహ్యంగా బాల్యంలోనే వరదరాజును దేవ వదిలివెళ్ళిపోతాడు. మెకానిక్ గా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఖాన్సార్ మీద ఆధిపత్యం కోసం శత్రు వర్గాలు దాడికి దిగడంతో వరదరాజు నిస్సహాయుడు అవుతాడు. అప్పుడు వరదరాజు కి దేవ అవసరం పడుతుంది.

Also Read: సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ

ఏళ్ళ తర్వాత మిత్రుడిని కలిసిన దేవ యుద్ధం ఎలా సాగింది? మిత్రుడు కోసం ఏం చేశాడు? అనేది కథ. సలార్ మూవీ ట్విట్టర్ టాక్ గమనిస్తే… ఇది ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. కథలో ఎమోషన్స్ కూడా బలంగా చెప్పాలి అనుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. ప్రభాస్ ఇంట్రో సీన్ అదిరిపోయింది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే గూస్ బంప్స్. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తో మైండ్ బ్లాక్ చేశాడు.

కెజిఎఫ్ మూవీ షేడ్స్ సలార్ లో కనిపిస్తాయి. ప్రధానంగా మూడు యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ సైతం అలరించింది. అయితే ఎమోషనల్ పార్ట్ వర్క్ అవుట్ కాలేదు. సినిమా అక్కడక్కడా సాగతీతకు గురైంది. మొత్తంగా సినిమా ఆకట్టుకుంది. ప్రభాస్ కి హిట్ పడిందని అంటున్నారు. సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావు, శ్రియ రెడ్డి కీలక రోల్స్ చేశారు.

Also Read: సలార్’ గురించి ఎవరికీ తెలియని విషయాలు