Salaar First Review: సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ…

ఈరోజు నైట్ నుంచే ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోస్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను కొంతమంది ప్రముఖులకు స్పెషల్ షో వేసి చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : December 21, 2023 4:55 pm

Salaar First Review

Follow us on

Salaar First Review: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్ ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇక సినిమా రేపు రిలీజ్ అవుతున్న క్రమం లో ఈరోజు నైట్ నుంచే ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోస్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను కొంతమంది ప్రముఖులకు స్పెషల్ షో వేసి చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రభాస్ తన స్నేహితుడైన పృథ్వి రాజ్ సుకుమారన్ కి కష్టం రావడం తో ఆయన కోసం వచ్చి సినిమా మొత్తం ప్రభాస్ ఫైట్ చేస్తునే ఉంటాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ కోసం అంతలా ఎందుకు చేస్తున్నాడు తన ప్రాణాలను రిస్క్ లో పెట్టి వాళ్ల ఫ్రెండ్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

Also Read: సలార్’ గురించి ఎవరికీ తెలియని విషయాలు

అయితే ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరించే విధంగా దర్శకుడు చాలా బాగా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మీదనే ప్రతి ప్రేక్షకుడు కూడా మంచి అంచనాలను పెట్టుకోవడంతో ఈ సినిమాని చాలా జాగ్రత్తగా దర్శకుడు తిసినట్టైతే తెలుస్తుంది.ఇక ఈ సినిమాను చూసిన కొంతమంది సెలబ్రెటీలు చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఈ సినిమా భారీ సక్సెస్ అవుతుందనే విషయం కూడా అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా బాహుబలి తర్వాత భారీ రేంజ్ లో కలక్షన్స్ ని కలెక్ట్ చేసే సినిమాగా కూడా నిలవబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను చూపించిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో ఒక సింహంలా కనిపిస్తాడు అనేది మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక భాహుబలి తర్వాత వచ్చిన ఏ సినిమాల్లో కూడా ప్రభాస్ ని ఫుల్ ఫ్లేడ్జ్ గా వాడుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో మాత్రం ప్రశాంత్ నీల్ ఆ తప్పు చేయకుండా ప్రభాస్ ని కంప్లీట్ గా వాడుకున్నాడు. ఇక ఈ సినిమా మొత్తానికి ప్రభాస్ ఒక్కడే హైలైట్ గా నిలుస్తాడు అంటూ చాలామంది చెప్తున్నారు…ఇక ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమి లేనప్పటికీ ఆ మైనస్ లన్నింటిని దర్శకుడు ప్లస్ లుగా మారుస్తూ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అలాగే కేజిఎఫ్ ని మించి ఈ సినిమాలో ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ 100% సక్సెస్ అయ్యాడు అంటూ పలువురు ఈ సినిమా మీద పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు…

Also Read: డంకి మూవీ ఫుల్ రివ్యూ